తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ మహామ్మరి  కరోనా  వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ కరోనా  వైరస్ కట్టడి మాత్రం ఎక్కడ జరిగటం లేదు . వెరసి రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అంతకంతకూ విస్తరిస్తూ ఎంతోమంది ప్రాణభయంతో బతికేలా చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. కరోనా  బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం తో పాటు... ఈ వైరస్ ద్వారా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో ప్రజలందరు  ప్రాణభయం ప్రశ్నార్థక  జీవితాన్ని గడుపుతున్నారు. 

 

 

 ఇక ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు యధేచ్చగా కోరలు  చాస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడే లేక చనిపోయాడు. ఇక ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో వ్యక్తి ఈ మహమ్మారి బారినపడి బలయ్యాడు. దాచేపల్లి మండలం నారాయణపురం కి చెందిన వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడు. కాగా  జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71 కి చేరుకుంది. ఈ ఒక్కరోజే 14 కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే ఈ రోజు కరోనా  వైరస్ బారిన పడిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉండటం ప్రస్తుతం అందరినీ ఆందోళన కలిగిస్తుంది. 

 

 

 అంతేకాకుండా నగరం లో ఒకే కుటుంబంలో ఐదుగురూ  కరోనా  వైరస్ బారిన పడడం ప్రస్తుత నగర వాసులు అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అవుతున్నప్పటికీ.. గుంటూరు నగరంలో మాత్రం ఈ లాక్ డౌన్  మరింత కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. చికెన్ మటన్ షాప్ లను సైతం మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉంచే నిత్యావసర సేవలు విషయంలో కూడా రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. రేపటి నుంచి ప్రతి రోజు కాకుండా రోజు మార్చి రోజు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. అనవసరంగా రోడ్డుమీదికి తిరిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: