ముంబైలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అటు కేసులు, ఇటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే దాదాపు 1000 కేసులు దాటిపోయాయి.  ఇక ముంబై  నగరంలోని ధారవిలో కోవిడ్ -19 కేసులు 43కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్టు ముంబై అధికారులు ప్ర‌క‌టించారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్నధారవిలో కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విష‌యం తెలిసిందే.

 

  ప్రధాని మోదీతో వీడియో కాన్ఫెరెన్స్‌ అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు.   ధారవిని జోన్లుగా విభజించారు. పూర్తిస్థాయిలో జనజీవనాన్ని స్తంభింప చేశారు. ధారవి చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేప‌ట్టారు. స్థానిక ప్రజల రాకపోకలపై దృష్టి పెట్టామని పోలీసులు తెలిపారు. ఐసోలేషన్, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని.. కరోనా వైరస్ విస్తకరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నామని చెప్పారు. ముంబై ప‌ట్ట‌ణంలో గంట‌గంట‌కు క‌రోనా కొత్త‌కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఏర్పాటు చేసిన ఆస్ప‌త్రుల బెడ్ల‌న్నీ నిండిపోయాయి.

 

ప‌రిస్థితి అదుపుత‌ప్పుతుందేమోన‌న్న టెన్ష‌న్ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం రంగంలోకి దిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే లాక్డౌన్‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేసేందుకు ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్ బ‌ల‌గాల‌ను కేంద్రం మ‌హారాష్ట్ర‌కు పంపింది. ఇదిలా ఉండ‌గా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలకు చేరువయ్యాయి. లక్షా 9వేల చేరువలో మృతుల సంఖ్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 544 కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,80,287. ఇవాళ కరోనా వ్యాధితో 43 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,08,822 మంది మరణించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: