ఆంధ్ర ప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ మాస్కులను పంపిణి చేయాలని నిరయం తీసుకున్నారు . ఈ మేరకు బ్రభుత్వ ప్రతినిధులతో వైఎస్ జగన్ సమీక్ష జరిపారు.  రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆయన స్పష్టం చేశారు.దీనితో కొంత వరకు ప్రొటెక్షన్ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ తన ఇంటివద్ద సమావేశం జరిపారు  సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అయితే లాక్షా యాభై వేలమంది కుటుంబాల సర్వే చేయగా 33349  మందికి ఎన్ఎమ్ లు మరియు ఆషావర్కర్ లు వైద్యాధికారులకు రిఫర్‌చేశారు.

 

అయితే 9 వేల మందికి పైగా పరీక్షలు అవసరమని .మొత్తానికి 33349 మందికి పరీక్షలు అవసరమని వైద్యాధికారులు చూచించారు . ముఖ్యంగా హైరిస్కు ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ ని కట్టు దిట్టంగా నిర్వహించాలని వై ఎస్ జగన్ చూచించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు కొత్తగా ఈ రోజు 15 కేసులు కాగా ఆంధ్రాలో పాజిటివ్ కేసులు మొత్తం కలిపి 420 కేసులు నమోదు అయ్యాయి ,గుంటూరులో 7 , నెల్లూరు లో 4 , కర్నూల్ లో 2 . కడప అనంతపురం లలో ఒక్కో కేసు ఇవాళ నమోదు అయ్యాయి 

 

మరింత సమాచారం తెలుసుకోండి: