ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా  వివరిస్తూ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే . చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను కబలిస్తోంది. అయితే ఈ మహమ్మారి వైరస్  వెలుగులోకి వచ్చి ఇప్పటికి నెలలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ ఈ వైరస్కు విరుగుడు మాత్రం లభించలేదు. ఈరోజు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే మొదటినుంచి కరోనా వైరస్ పై  ప్రపంచం మొత్తం అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చైనా కావాలనే కరోనా వైరస్ ను  తయారుచేసి ప్రపంచదేశాల మీదకి వదిలింది అనే  విమర్శలు కూడా ఎదుర్కొంటుంది చైనా ప్రభుత్వం. చైనా తీరు కూడా ఇందుకు  ఊతమిచ్చేలా ఉంది. 

 

 

 ప్రస్తుతం చైనాలో వెలుగులోకి  వచ్చిన మహమ్మారి వైరస్ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాలో కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.కానీ  శాస్త్రవేత్తలు పరిశోధన ఫలితాలు ప్రపంచం దృష్టిలో పడకుండా ఉండేందుకు చైనా నిరంకుశంగా వ్యవహరిస్తోంది.  దీనికి సంబంధించి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. షాంగై లోని ఫుడన్  వర్సిటీ, వుహాన్ లోని  చైనా యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్స్ అధ్యయనం జరిపింది . కరోనా  వైరస్ రహస్యం సహా పలు  వివరాలను సేకరించి పరిశోధన పత్రాలను తమ వెబ్సైట్ లో  ప్రచురించాయి ఈ పరిశోధన సంస్థలు. 

 

 

 కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ... తాజాగా ఆ పరిశోధన పత్రాలను  వెబ్సైట్  నుంచి చైనా  ప్రభుత్వం తొలగించింది. దీంతో మరోసారి చైనా ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా  వైరస్ మూలలకు సంబంధించిన రహస్యాలను చైనా కావాలనే దాస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. అయితే ప్రపంచవ్యాప్తంగా చైనా దేశంపై  ఎన్నో  విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ చైనా దేశం మాత్రం నిరంకుశ గానే వ్యవహరిస్తుంది. పరిశోధన సంబంధించిన ఫలాలకు సంకెళ్లు  వేస్తూ... అసలు నిజాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా కఠినంగా వ్యవహరిస్తోంది చైనా ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: