కరోనా అంటేనే మహమ్మారి. అది విశ్వం మొత్తం విడిచిపెట్టకుండా వెతికి వెంటాడుతోంది. రెండు వందల దేశాలకు మూకుమ్మడిగా  ఎగబాకింది. వరసగా ఒక్కో దేశాన్ని వణికించేస్తోంది. కరోనా అంటేనే ఇపుడు జగం మొత్తం భయపడుతోంది. కంటికి కనబడని శత్రువుతో పోరాడుతోంది. అయినా కూడా  అది వికటాట్టహాసం చేస్తూనే  ఉంది.

 

ఇదిలా ఉండగా కరోనా దెబ్బకు దేశాలకు దేశాలు తలుపులు మూసుకున్నాయి. ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఎవరికి తెలియదు. అంతా అయోమయం. అనుక్షణం భయం. ఈ నేపధ్యంలో చాలా కీలకమైన రంగాలు లాక్ డౌన్ వల్ల దెబ్బ తింటాయని అంటున్నారు. అవి సినిమా రంగం, హొటల్ రంగం, టూరిజం రంగం. ఈ మూడు రంగాలూ కోలుకోవాలంటే ఇప్పట్లో సాధ్యపడదని కూడా చెబుతున్నారు.

 

చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో  ఈ రంగాలు  మెజారిటీ కమ్మ సామాజిక వర్గం చేతుల్లో ఉన్నాయి. ఈ రంగాలు మళ్ళీ బతికి బట్టకట్టాలంటే సుధీర్ఘ కాలమే పడుతుందని అంటున్నారు.  వ్యాపారంలో దూకుడుగా ఉన్న కమ్మ వారికి గత ఏడాదిగా రాజకీయంగా కల‌సి రాలేదు. ఇపుడు కరోనా దెబ్బతో మొత్తానికి మొత్తం చిత్తు అయిపోతామన్న భయం వారిని నిలువెల్లా వణికిస్తోందిట.

 

ఏడాది క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ రియల్ బూమ్  ని నేలకు దించేశారు. నిర్మాణ రంగం కుదేలయింది. ఇక మిగిలింది ఫరవాలేదూ అనుకుంటే కరోనా వచ్చి మొత్తానికి మొత్తం ఊడ్చేసింది. ఈ పరిస్థితుల్లో భవ్యిష్యత్తు ఎలా అన్న బెంగ ఆ వర్గంలో ఉందిట.

 

ఈ మధ్య ఆ సామాజిక  వర్గీయులంతా వాట్సప్ మీటింగు పెట్టుకుని మరీ తమ గోడు వెళ్ళబోసుకున్నారుట. మరి అన్నీ ఒకే మారు వస్తే అందరికీ కష్టమే. వారికి మరి కొంత ఎక్కువ కష్టం ఉండొచ్చేమో.  ఏది ఏమైనా కూడా కరోనా మహమ్మారికి వారూ వీరూ లేదుగా. ఎవరైనా ఒక్కటేగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: