సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నత అధికారులతో ఈరోజు సమావేశం జరిపారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు .ఈ సమావేశంలో విద్యారంగానికి వచ్చేఏడాది నుండి చేయవలసిన మార్గ నిర్దేశకాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఫీజ్ రియంబర్స్ మెంట్ గురించి చర్చ జరిగింది. అమ్మవడి పథకం మాదిరిగానే విద్యార్థుల ఫీజ్ రియంబర్స్ మెంట్ నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫీజ్ రియంబర్స్ మెంట్ అంతాకూడా త్రైమాసిక పద్దతిలో చెల్లిస్తారు. ఈ సంవత్సరం త్రైమాసిక ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇప్పటికే విద్యార్థి తల్లుల ఖాతాలో జమచేయడం జరిగిందని తెలియజేసారు.

 

 

ఈ విధానం వచ్చే ఏడాది నుండి అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేసారు. తెలుగు దేశం హయాంలో ఉన్న 18వేల కోట్ల ఫీజ్ బకాయిలను ఇప్పటికే తాము చెల్లించామని వైఎస్ జగన్ తెలిపారు. కాగా ప్రాతి విద్యార్థి ఫీజ్ రియంబర్స్ మెంట్ కింద 35 వేల రూపాయలు చెల్లించామని .కానీ కొన్ని విద్య సంస్థలు అంతకంటే ఎక్కువ ఫీజలను వాసులు చేశారని . అధికంగా తీసుకున్న ప్రాతి పైసా విద్యార్థికి వెనుకకు తిరిగి ఇచ్చేలా చేస్తామని. తిరిగిచ్చిన ఫీజ్ అంతాకూడా తల్లిఖాతాలోనే వేస్తామని చెప్పారు 
  

మరింత సమాచారం తెలుసుకోండి: