కరోనా కష్టాలు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారాయి.. అధికారులు ఎంతలా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన తప్పు చేసేవారు చేస్తూనే ఉన్నారు.. తన్నులు తినే వారు తింటూనే ఉన్నారు.. కానీ ఈ కష్టకాలంలో పేదవాడికి వచ్చిన కష్టం, నష్టం మాటల్లో చెప్పలేము.. ఇక వలస కూలీల సంగతైతే దిక్కులేని అనాధల బ్రతుకైంది.. ఒక వైపు సొంత ఊర్లకు వెళ్లలేక.. ఉన్న చోట తిండి దొరక్క అల్లాడిపోతున్నారు.. కొందరు ప్రాణాలకు తెగించి కాలినడకన తమ స్వగ్రామాలకు చేరుకోగా, మరికొంత మంది యువకులు సైకిల్ పై తమ ప్రయాణాన్ని సాగించి వారి ఇళ్లకు చేరుకున్నారు..

 

 

ఇక ఏ దారి తెలియని వారు దొరికిన వాహానాల్లో దొంగల్లా ప్రయాణాలు చేస్తున్నారు.. ఇలాంటి ప్రయత్నమే చేసిన కొందరు చివరికి పోలీసుల చేతికి చిక్కి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించబడ్డారు.. ఇలా చేయడం ఒక రకంగా తప్పే.. ఒక వేళ వారిలో ఎవరికైనా కరోనా పాజిటీవ్ ఉంటే పరిస్దితి ఏంటి.. కానీ ఆకలి వారిని ఇవేమి ఆలోచించకుండా చేసింది.. ఇక ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

నిత్యావసర సరకులతో హైదరాబాద్‌ నుండి బయలు దేరిన రెండు వాహనాల్లో 31మంది వలస కార్మికులు దొంగతనంగా జిల్లాలోకి ప్రవేశించారు. రెండు రోజుల కిందట బయలుదేరిన వీరంతా.. ప్రతి చెక్ పోస్టులో పోలీసుల తనిఖీల నుండి బయటపడ్డారు. ఇక సోమవారం అర్ధరాత్రి దాటాక జిల్లాలోకి ప్రవేశించి గజపతినగరం చేరుకున్నారు. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులుకు అనుమానం వచ్చి సరకులను నిశితంగా పరిశీలించగా అందులో కొంతమంది వ్యక్తులు దాగి ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారందరు సుమారు 31మంది అయ్యారు..

 

 

ఇకపోతే వాహనాల్లో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకుని వివిధ చోట్ల పోలీసులు విడిచిపెట్టి ఉంటారని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ కూలీలను అదుపులోకి తీసుకుని పార్వతీపురం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు జరపనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే బాధితుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం మండలాలకు చెందిన వారు ఉన్నారు. ఇకపోతే ఆ రెండు వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించామని అధికారులు పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: