తెలుగు చిత్ర పరిశ్రమలో అందం ఒక్కటే ఉంటే సరిపోదు  అదృష్టం కూడా కలిసి రావాలి. దానికితోడు టాలెంట్ కూడా ఉండాలి. కొన్ని కొన్ని సార్లు అందం టాలెంట్  ఉన్నప్పటికీ... అదేంటోగాని తమని తాము నిరూపించుకున్న లేకపోతు  ఉంటారు  చాలామంది నటులు. ఈ కోవలోకి వస్తుంది రెజీనా. ఈ అమ్మడు అందానికి ఫిదా అవ్వని  ప్రేక్షకుడు ఉండడు. తనదైన హాట్ హాట్ అందాలతో ఎంతోమంది ప్రేక్షకుల మతి పోగొట్టింది రెజీనా కసాండ్రా. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఇక నటనలో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఇప్పటి వరకూ బాగానే సినిమాలు కూడా చేసేసింది . 

 

 

 గ్లామర్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. గ్లామర్ పాత్రలతో పాటు వైవిధ్యమైన పాత్రలు కూడా పోషించింది . అయితే ఎన్ని పాత్రలు చేసిన ఈ అమ్మడికి అదృష్టం మాత్రం అంతగా కలిసి  రావడం లేదు. ప్రతి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడికి ప్రతి సినిమాలో నిరాశే ఎదురవుతుంది . ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి . కేవలం తెలుగు పరిశ్రమలోనే ఇలాంటి పరిస్థితి ఉందా అంటే అలా ఏం లేదు తమిళ ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి. దీంతో ఎలాగైనా అవకాశాలు సాధించాలనుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాను నమ్ముకుంది. 

 

 

 మొన్నటి వరకూ తన అందాల ఆరబోతలో కొన్ని లిమిట్స్ పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అన్ని లిమిట్స్  తీసేసింది. తన అందాలను గట్టిగానే ఆరబోస్తుంది. అయినప్పటికీ ఎందుకొ  దర్శక నిర్మాతలు మాత్రం రెజీనా  పైన అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన రెజినా కాసాండ్రా తన మనసులో ఉన్న మాట బయట పెట్టింది. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో కనిపించి తన హాట్ హాట్ అందాలతో అందరికీ చెమటలు పట్టించిన ఈ అమ్మడుకి ... ఇంకా అంతకుమించిన హాట్ గర్ల్ రోల్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులో మాట చెప్పేసింది. క్యారెక్టరైజేషన్ పరంగా వెరీ డిఫికల్ట్ గా ఉంది బ్యాడ్ ఆస్ రోల్స్  చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం నిను వీడని నీడను నేనే అనే సినిమాలో నటించడంతో పాటు చిరు సినిమాలో  ఒక ఐటం సాంగ్ లో కూడా కనిపించబోతుంది రెజీనా కాసాండ్రా .

మరింత సమాచారం తెలుసుకోండి: