లాక్‌డౌన్ క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని వ‌ర్గాలు ఈ ప‌రిణామంతో స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాయి. లాక్ డౌన్ వల్ల పలు ప్రాంతాల్లో పనిచేసే వలస కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండిలేక ఆక‌లికి అలమటిస్తున్నారు. , పూటగడవక పొద్దుపోక అటు సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. మ‌రోవైపు స్థానికుల‌కు డ‌బ్బుల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాయి. అయితే, ఈ విష‌యంలో జ‌రుగుతున్న ఓ ప్ర‌చారం ప‌లువురిలో ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో అకౌంట్ల‌లో వేసిన డ‌బ్బులు వెన‌క్కి తీసుకుంటారు అనేది ఆ ప్ర‌చారం.

 

దీనిపై తాజాగా క్లారిటీ వ‌చ్చింది. లాక్ డౌన్ రిలీఫ్ ప్యాకేజ్ లో భాగంగా 20.5 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు ఇస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవల జన్ ధన్ అకౌంట్లలో జమ చేశారు. ప్రభుత్వం జమ చేసిన డబ్పులను వెంటనే విత్ డ్రా చేసుకుకోంటే వెనక్కి తీసుకుంటారని వదంతులు వచ్చాయి. దీంతో మహిళలంతా బ్యాంకులకు క్యూ కట్టారు. దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మహిళల జన్ ధన్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసిన డబ్బులు సేఫ్ గా ఉంటాయని, ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చ ని కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించిం ది. వెంటనే విత్ డ్రా చేసుకోకుంటే వెనక్కి తీసుకుంటారన్న వదంతులను నమ్మవద్ద ని చెప్పింది. 

 

మ‌రోవైపు, తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి రేషన్‌ కార్డు దారుడికి రూ. 1500 చొప్పున సాయం చేస్తామని ప్రకటించి ఈ మేరకు ఏప్రిల్‌ 14వ తేదీన ప్రతి రేషన్‌ కార్డు దారుడి బ్యాంకు ఖాతాలో రూ. 1500 చొప్పున జమ చేసింది. ఇలా 74 లక్షల మంది ఖాతాల్లో రూ. 1500 చొప్పున జమ చేశారు. అయితే, నగదు తీసుకోకపోతే వెనక్కిపోతుందనే దుష్ప్రచారం జ‌రిగింది.  దీంతో ఇవాళ బ్యాంకుల ముందు జనాలు బారులు తీరారు. ఈ నేప‌థ్యంలో సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్‌ చైర్మ‌న్ మారెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్ర‌చార‌న్ని నమ్మొద్దు అని ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. వినియోగ‌దారులు 

మరింత సమాచారం తెలుసుకోండి: