కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో అన్ని దేశాల కంటే అమెరికా విలవిలలాడిపోతూ ఉంది. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉంటే, మరోపక్క లక్షల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ వచ్చిన ప్రారంభంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా సిల్లీగా తీసుకోవడం జరిగింది. అయితే ఉన్న కొద్ది వైరస్ ప్రభావం అమెరికాలో చాలా గట్టిగా ఉండడంతో వెంటనే డోనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వచ్చేస్తుందని కంగారు పడనవసరం లేదు అని తెలిపారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ కనుగొన లేక పోవడంతో అమెరికాలో పరిస్థితి చాలా డేంజరస్ గా మారిపోయింది.

 

అమెరికా దేశంలో ఉన్న మేధావులు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు డోనాల్డ్ ట్రంప్ మొండి వ్యవహారం వల్ల దేశంలో అమెరికా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు అని మండిపడుతున్నారు. ఇటువంటి టైములో త్వరలో రాబోతున్న అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ డోనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలు  రాబోయే నవంబర్లోనే జరుగుతాయని, ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. రిపబ్లికన్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డోనాల్డ్ ట్రంప్ కు రాబోయే ఎన్నికలలో కరోనా వైరస్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇప్పుడు ఇదే విధంగా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించినట్లు గానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వ్యవహరిస్తున్నారని ప్రతి పక్షాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా ఉంటే.. కేంద్రం లాక్ డౌన్ ఎత్తి వేయగానే స్థానిక ఎన్నికలు జరపాలని ఆలోచనలో జగన్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. అక్కడ అమెరికన్ల ప్రాణాలు పోవడానికి ట్రంపు కారణమైతే.. ఎలక్షన్ జరిగిన సమయంలో కరోనా వైరస్ ఏపీలో ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఎవరైనా ప్రాణాలు పోతే దానికి కారణం వైయస్ జగనే అని ముందుగానే హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: