మన శరీరమే ఒక అద్భుతమైన సృష్టి. మెదడుని కేంద్రంగా చేసుకుని మిగతా అవయవాలన్నీ ఒక మనిషి జీవితాంతం ఎటువంటి చింతా లేకుండా హాయిగా బ్రతకడానికి తోడ్పడతాయి. మనం తినే తిండి దగ్గర నుండి త్రాగే నీరు వరకు.. కార్చే చెమట నుండి బయటకు వదిలే మలాల వరకు ప్రతి ఒక్కటే వింతే. అయితే సాధారణంగా మానవుడు తనను తాను అభివృద్ధి చేసుకునేందుకు అత్యవసరమైన అవయవం పురుషాంగం. దాని మూలంగానే ప్రస్తుతం ఇంత జనాభా వచ్చింది. ఒకవేళ అవయవం ఎముక లాగా మారిపోతే పరిస్థితి ఏంటి?

 

సాధారణంగా పురుషాంగం మృదువైన కణజాలంతో ఏర్పడి ఉంటుంది. మన శరీరంలోని హార్మోన్లు ఏర్పడినప్పుడు అధిక శాతం రక్తప్రసరణ జరిగి అది గట్టిపడి శృంగార క్రియకు తోడ్పడుతుంది. అయితే పురుషాంగంలో కేవలం కణజాలాలు తప్ప ఎటువంటి ఎముకలు ఉండవు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి పురుషాంగం ఎముకలా మారుతున్న తీరు చూసి వైద్యులు సైతం విస్తుపోతున్నారు. వైద్య చరిత్రలోనే దీనిని ఒక అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు.

 

న్యూయార్క్ లోని 63 ఏళ్ల వ్యక్తికి ఇటీవల పురుషాంగం వద్ద నొప్పి గా ఉండడంతో బ్రోంక్స్ లోని లింకన్ మెడికల్ హెల్త్ సెంటర్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతని రిపోర్టులు చూసిన డాక్టర్లు అతని పురుషాంగం వద్ద ఎముక కణాలు పెరుగుతున్నట్లు గుర్తించి అతనికి పరిస్థితిని వివరించగా అతడు వారిని లెక్కచేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకే అతను ఒక వీధిలో కింద పడ్డాడు. నడుముకి దెబ్బతగిలిన  తరువాత నడుస్తున్నప్పుడు మోకాలు కూడా బాగా నొప్పిగా ఉందని వైద్యుల్ని మళ్లీ ఆశ్రయించాడు.

 

అప్పుడు మరలా ఎక్స్ రే తీస్తే అతడి పురుషాంగం మరింతగా ఎముకగా మారినట్టు గుర్తించారు. అది పూర్తి ఎముకగా మారబోతోందని హెచ్చరించారు. పురుషాంగం ఎముకగా మారే ప్రక్రియను అస్థీకరణ (ఓసిఫికేషన్) అంటారని.. అరుదుగా ఏర్పడి వ్యాధి వల్ల కణజాలాలు పూర్తిగా ఎముకలా మారుతాయని వైద్యులు తెలిపారు. దీనికి సర్జరీ చేయాల్సి ఉంటుందని.. షాక్ వేవ్ థెరపీ ద్వారా చికిత్స చేస్తామని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే అంగం పూర్తిగా ఎముకలా మారుతుందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: