తెల్లరేషన్ కార్డుదారుల బ్యాంకుల్లో డబ్బులు జమయ్యాయి. లాక్ డౌన్ నుంచి పేదలకు ఆహార భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ ప్రతీ ఇంటికి 1500 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఖాతాల్లో డబ్బుల జమఅయిన వారు బ్యాంకుల ముందు క్యూలో నిల్చున్నారు. ఇక తమ ఖాతాల్లోకి డబ్బులు జమకానీ వారు మాత్రం ఆందోళనతో ఉన్నారు. అందరికి సాయం అందుతుందని ప్రభుత్వం మాత్రం భరోసా ఇస్తోంది.

 

తెలంగాణలో రేషన్ కార్డు దారులు 82 లక్షల మంది ఉన్నారు. వీరంతా పేదరికంతో ఉన్నవారే కాబట్టి...లాక్ డౌన్ నేపద్యంలో ఆహార భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ ప్రతీ కార్డు దారుకి 1500 చొప్పున బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి 2 వేల కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటికే ప్రభుత్వం 76 లక్షల రేషన్ కార్డు దారులకు డబ్బులు విడుదల చేసింది. మిగిలిన ఆరు లక్షల కుటుంబాలకు ఇంకా ఆర్ధిక సాయం అందాల్సి ఉంది. వీరికి తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొందరికి బ్యాంకు ఖాతాలు లేకపోవటం లాంటి సమస్యలున్నాయి. దీంతో వీరంతా ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదరుచూస్తున్నారు. తమకు ప్రభుత్వం అందించే సాయం అందుతుందా..? లేదా..? అనే ఆందోళనలో ఉన్నారు. ఐతే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సాయం అందుతుందని ప్రభుత్వం బరోసా ఇస్తోంది. మిగిలిన ఆరు లక్షల మంది కి సంబందించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానీ వారు సివిల్ సప్లయిస్ శాఖకు సంబందించిన అధికారులను సంప్రదించ వచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి తోడు డీలర్ల నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తోంది. ఒకటీ...రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.

 

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న పేదలు అంతా టెన్ఫన్ తో ఉన్నారు. తమ వరకు సాయం అందుతుందా..? లేదా... అనే ఆందోళన మాత్రం వారిలో కనిపిస్తోంది. అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్నారు. ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకనేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడే కుటుంబాలు ప్రభుత్వ సాయం అందింతే నిత్యావసరాలకు అక్కరకు వస్తాయనే ఆశతో ఉన్నారు. హైదరాబాద్ లో వచ్చి నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు అంతా సీఎం అందించే సాయం కోసం చూస్తున్నారు. బ్యాంకుల వద్దకు వచ్చి ఖాతాలోకి డబ్బులు వచ్చాయో లేదో అని తెలుసుకునేందుకు క్యూ కడుతున్నారు.

 

అకౌంట్లలో డబ్బులు జమ కానీ వారి ఆందోళన ఒకటైతే... ప్రభుత్వం అందించిన సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అయిన వారికి తిప్పలు తప్పటం లేదు. అకౌంట్లో పడ్డ డబ్బులను విత్ డ్రా చేసుకోవటం కోసం బ్యాంకుల ముందు భారీగా క్యూ కడుతున్నారు. మండే ఎండలో నిలబడి డబ్బులు తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకులు తెరవక ముందే బ్యాంకుల ముందు క్యూలు వెలుస్తున్నాయి. ఇక  కరోనా టెన్షన్ ఎక్కువగా ఉన్న నిజామాబాద్,. నల్గొండ జిల్లాలో బ్యాంకుల వద్ద సామాజిక దూరాన్ని పాటించే అంశం ఇబ్బందిగా మారుతుంది. సామాజిక దూరం పాటించటం లేదని బ్యాంకుల్లోని ఖాతాదారున్నిఅనుమతించే పరిస్ధితి లేదు. కొన్ని చోట్ల టోకెన్లు విడుదల చేస్తున్నారు బ్యాంకు అధికారులు.

 

తెలంగాణలో ఉన్న మెజార్టీ రేషన్ కార్డు దారులకు ఇప్పటికే డబ్బులు ఖాతాలో జమయ్యాయి. ఇంకా ఆరు లక్షల కార్డు దారుల పరిస్ధితి ఏంటి..? ప్రభుత్వం సమాచారం సేకరించే వరకు వేచిచూడాల్సిందేనా..? ఒకటీ రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నా.... జనంలో మాత్రం ఆందోళన తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: