వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. పార్టీ నాయకులంతా మంత్రులు అయ్యారు. ప్రజల తరఫున బాధ్యత వహిస్తున్నారు. ఇపుడున్న నేపధ్యంలో ప్రభుత్వం మీద జనాలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇంకా కష్టపడాలి. ప్రజల మెప్పు పొందాలి.

 

కనీ ఈ దశలోనే గొడవలకు దిగితే ఎలా ఉంటుంది. అది కూడా పార్టీలో నాయకుల మధ్య కాదు, ఏకంగా జగన్ కుడిభుజం మీదకే కత్తులు దూస్తానంటే వైసీపీలో కుదురుతుందా. విశాఖ జిల్లకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు గా ఉన్న విజయసాయిరెడ్డితోనే పెట్టుకుంటున్నారు.

 

విజయసాయిరెడ్డి విశాఖలో తన హవా చూపిస్తున్నారని, తనను బాగా తగ్గిస్తున్నారని అవంతి తెగ ఫీల్ అవుతున్నారు. జిల్లాలో ఇంతకీ తాను మంత్రినా కానా అన్న డౌట్ మొత్తానికి ఆయనకే  వస్తోందిట. జిల్లాలో జరిగే  అన్ని సమావేశాలకూ విజయసాయిరెడ్డి అధ్యక్షత వహిస్తున్నారుట.

 

ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విజయసాయిరెడ్డికే జై కొడుతున్నారుట. తనను వారు కూడా పట్టించుకోవడంలేదుట. మరో వైపు జిల్లా అధికారులు సైతం తనకు మంత్రిగా తగిన విలువ ఇవ్వడంలేదని మంత్రి గుస్సా అవుతున్నారు.

 

ఓ వైపు కరోనా మహమ్మారి ఉంది. ఈ సమయంలో అలకపానుపు ఎక్కిన అవంతి ఎంపీ విజయసాయిరెడ్డికి దూరం పాటిస్తున్నారు. మరి ఇలాగైతే మంత్రిగా అవంతికి కష్టమేనని అంటున్నారు. మంత్రి వైసీపీలో జరుగుతున్న పరిణామాలు. ఎవరు ఏమిటి అన్నీ తెలుసుకుని కూడా ఇలా వ్యవహరించడమేంటని కూడా పార్టీలో మరో వైపు చర్చ సాగుతోంది.

 

నిజానికి అవంతికి ఇది అవమానంగా ఉందని అంటున్నారు. తాను జిల్లాలో ఏకైక మంత్రిగా ఉంటే వేరొకరి పెత్తనం ఏంటని కూడా ఆయన గుస్సా అవుతున్నారట. ఏకంగా కొండనే ఢీ కొట్టేందుకు అవంతి రెడీ అవుతున్నట్లుగా ఉంది.  ఏమైనా గొడవ మొదలైపోయింది. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: