భారతదేశంలో కరోనా తాకిడి రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక, రాజకీయ నాయకులు, కూలి వాళ్ళు అన్న తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తోంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్షిణ కొరియా దేశం నుండి ఒక లక్ష కొత్త టెస్టింగ్ కిట్లను రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం జరిగింది.

 

ఇకపోతే కొత్తగా వచ్చిన టెస్టింగ్ కిట్ల లో ఒకసారి పరీక్ష చేస్తే దానికి సంబంధించిన ఫలితం కేవలం 15 నిమిషాల్లో బయటికి వస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇప్పటివరకు వచ్చిన టెస్టింగ్ కిట్ల తో పోలిస్తే పరికరాలు చాలా అత్యాధునికంగా మరియు స్వల్ప వ్యవధిలో ఎక్కువ వ్యక్తులకు టెస్ట్ చేసేలా డిజైన్ చేయబడడం గమనార్హం.

 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన టెస్టింగ్ కిట్లను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా తనపైనే వాటిని మొదటిసారి ప్రయోగం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దక్షిణ కొరియా నుండి వచ్చిన టెస్టింగ్ కిట్లతో జగన్ మోహన్ రెడ్డి కి కరోనా ఉందా లేదా అన్న విషయం పై అతని దగ్గర శాంపిల్స్ తీసుకొని పరీక్ష చేయగా అతనికి కరోనా నెగిటివ్ అని తేలింది.

 

పరీక్ష జరుగుతున్నంత సేపు ఆసక్తిగా మరియు టెన్షన్ గా చూసిన అతని పార్టీ నేతలంతా చివరికి ఊపిరిపీల్చుకున్నారు. రేపటినుండి అనుమానితులందరికీ కొత్త రాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు జరపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: