కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాల్లో చాలావరకు ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. కరోనా వైరస్ కి మందు లేకపోవడంతో నియంత్రణ ఒకటే మార్గమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపు మేరకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో ఆఫీసులు అన్ని రంగాల్లో మూత పడిపోయాయి. చాలా వరకు ఆర్థిక మాన్యం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలో అదేవిధంగా ప్రైవేట్ కార్యాలయాలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రొం హోమ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

 

 

 

దీంతో చాలావరకు జూమ్ యాప్ ద్వారా చాలామంది తమ పనులను ఇంటి దగ్గర నుండే చక్కబెడుతున్నారు. ఇటువంటి టైములో భారత్ సైబర్ సెక్యూరిటీ సంస్థ జూమ్ యాప్ ఉపయోగిస్తున్న వాళ్లకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్ వాడటం వల్ల డేటా హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఆఖరికి ఈ యాప్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వాడటం జరిగింది.

 

 

ఇటువంటి తరుణంలో 5 లక్షల మంది యూజర్ల డేటాని హ్యాకర్లు డార్క్ నెట్ ద్వారా హ్యాక్ చేసినట్లు తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ లో ఉన్న లోపాల కారణంగా పర్సనల్ డేటా మరియు ఇంకా విలువైన సమాచారం కొల్లగొట్టే అవకాశం ఉందని...తెలియజేస్తున్నారు. ఈ యాప్ వాడటం వల్ల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటం ఖాయమని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అమెరికా మరియు యూరోప్ కంట్రీ లు అదేవిధంగా భారత్ లో కూడా జూమ్ యాప్ వాడకాన్ని ఆపేసయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: