ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాలలో కర్నూలు రెండో స్థానంలో ఉంది. దాదాపు వంద పాజిటివ్ కేసులు ఈ జిల్లాలో దాటిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య సరైన అండర్స్టాండింగ్ లేక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆగ్రహం చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో వందల్లో కేసులు నమోదు అవ్వటానికి కారణం  జిల్లా కలెక్టర్ అంటూ ఒక ఆంగ్ల పత్రిక ముందు వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇటువంటి టైం లో ఒక డైనమిక్ కలెక్టర్ ని కర్నూలు జిల్లాలో నియమించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

 

కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్ చాలా నిర్లక్ష్యంగా ను మరియు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని... ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా తమ ఫోన్ కి రెస్పాండ్ అవటం లేదు అని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అసలు మా సలహాలు గాని సూచనలు గాని కలెక్టర్ తీసుకోవడం లేదని, కూరలో కరివేపాకు లాగా పక్కన పెట్టేస్తున్నారు అని వాపోతున్నారు. ఇంత దారుణంగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించి ఉంటే అరికట్టడానికి కలెక్టర్ దగ్గర సరైన ప్రణాళిక కూడా ప్రస్తుతం లేదని మండిపడుతున్నారు. దీంతో ఈ కలెక్టర్ వ్యవహారం సీఎం జగన్ దగ్గర తేల్చుకుంటామని..కరోనా కేసులు ఎక్కువగా నమోదైన నియోజకవర్గం ఎమ్మెల్యే అంటున్నారు.

 

అయితే ఈ తరుణంలో ప్రభుత్వ అధికారులు మాత్రం...కరోనా వైరస్ జిల్లాలో ప్రవేశించినప్పటి నుండి రాత్రింబవళ్లు కష్టపడుతుంది మేమే అని అంటున్నారు. ఆ విషయం అధికారంలో ఉన్న పెద్ద నేతలకు, నాయకులకు తెలుసు అని ఎవరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. మాకు భయం లేదని ప్రభుత్వ అధికారులు మరోపక్క వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: