కంటికి కనిపించనంత చిన్నగా ఉన్న వైరస్‌తో ఇన్ని దేశాలు కష్టాలు ఎదుర్కొంటాయని ఎవరు ఊహించి ఉండరు.. పుట్టిన చోటుతోనే ఆగిపోకుండా ప్రపంచం మొత్తం చుట్టేస్తున్న కరోనా వైరస్ వల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో.. ఎందరి జీవితాలు అనాధలా మారుతున్నాయో లెక్కే లేదు.. ప్రపంచం మొత్తం భయంకరమైన నిశబ్ధంలోకి వెళ్లిపోయింది.. ప్రపంచ చరిత్రనే తిరగ రాసేటంతటి మరో చరిత్రను కరోనా సృష్టించింది.. ఎన్ని లక్షల కోట్ల నష్టాలు ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయో తలచుకుంటే జీవితం భయంకరంగా మారుతుంది.. పోని ఇంతటితో ఈ వైరస్ వ్యాప్తి ఆగిందా అంటే అదీలేదు.. ప్రపంచంలో ఎవరు పనిచేయకున్నా.. తనపని తాను మాత్రం చేసుకుంటు పోతుంది..

 

 

ఇకపోతే ప్రస్తుతం మనదేశంలో ఇప్పటి వరకు ఈ కరోనా కొరలను తాకిన రాష్ట్రాలు.. ఈ వైరస్ బారిన పడని ప్రాంతాల గురించి తెలుసుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. జనాలు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతాల్లోనే వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అంటే.. పట్టణ ప్రాంతాల్లోనే అన్నమాట. ఇందుకు 350 డిస్ట్రిక్స్ లో అసలు కరోనా కేసులు లేకపోవడమే ఉదాహరణ.. ఇది ఒకింత ఊపిరి పీల్చుకునే వార్తే. ఇక 70కి పైగా జిల్లాలో కేవలం ఒకే ఒక్క కేసు నమోదు కావడం. 148 జిల్లాల పరిధిలో 10కి మించి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే లక్ష ద్వీప్, దాద్రానగర్, సిక్కిం లో ఒక్క కేసూ నమోదు కాలేదు. బెంగళూరు, కోల్ కతాలలో కరోనా వైరస్ స్పీడుగా వ్యాపిస్తోంది.

 

 

ఇక మిగతా రాష్ట్రాల పరిస్దితి చూస్తే.. తెలంగాణలో ఉన్న.. వరంగల్ గ్రామీణం, వనపర్తి, మంచిర్యాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరిల్లో కేసులు లేవు. అత్యధికంగా హైదరాబాద్ లో కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో పరిశీలిస్తే.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు లేవు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అటూ తమిళనాడులో.. చెన్నై, కోయంబత్తూరులో ఎక్కువగా కేసులున్నాయి. కాగా కేరళ కరోనా వైరస్ ను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొనడమే కాకుండా.. ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇకపోతే 63 శాతం కాసరగోడు, కన్నూరు జిల్లాలో మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు బీహార్ లో ఉన్న 38 జిల్లాలో 11 జిల్లాలో వైరస్ విస్తృతంగా వ్యాపించింది. సివాన్ జిల్లాలో 29 కేసులు రికార్డ్ అయ్యాయి.

 

 

ఇక ఒడిశా లో ఉన్న 30 జిల్లాలో 9 జిల్లాలో కరోనా ఉంది. కాగా ఖుర్దా జిల్లాలో ఎక్కువగా కేసులున్నాయి.. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. గుజరాత్.. వడోదర, అహ్మదాబాద్ లలో 74 శాతం కేసులు రికార్డయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో చూసుకుంటే, ఢిల్లీకి సమీపంలో ఉండే..గౌతమ్ బుద్ధ నగర్, మేరఠ్, ఆగ్రాలో అత్యధికంగా కేసులున్నాయి. ఇక్కడున్న 75 జిల్లాలో 43 చోట్ల వైరస్ లక్షణాలు చాలా బయట పడుతున్నాయి. ఇకపోతే మహారాష్ట్ర లో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.. అదీగాక ముంబై, పూణే నగరాల్లో  83 శాతం వైరస్ వ్యాపించిగా.. మధ్యప్రదేశ్ లోని భోపాల్, ఇండోర్ ఈ వైరస్ హాట్ స్పాట్ లుగా ప్రకటించబడ్డాయి..

 

 

ఇక కర్నాటక లో కేవలం 19 డిస్ట్రిక్స్ లో మాత్రమే వైరస్ వ్యాపించింది. అందులో బెంగళూరు, మైసూరు, బెళగావి, బీదర్, దక్షిణ కన్నడ జిల్లాలో పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఝార్ఖండ్ లో చూసుకుంటే అక్కడున్న 24 జిల్లాలకు గాను 5 జిల్లాలో విస్తరించింది. అందులో రాంచీ, ఉక్కు నగరం బొకారాల్లో 83 శాతం కేసులు రికార్డవుతున్నాయి... పశ్చిమ బెంగాల్లో కేవలం 8 జిల్లాలకే కరోనా వైరస్ వ్యాపించింది. 4 జిల్లాలో కేవలం ఒకే ఒక్క కేసు ఉంది. మిగతా మూడు జిల్లాలో 3 నుంచి 5 కేసులున్నాయి...  ఉత్తరాఖండ్ లో చూస్తే 13 జిల్లాలకు గాను 6 జిల్లాలో కేసులు నమోదవగా, ఈ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్ లో మాత్రం అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

 

 

మరో వైపు ఛత్తీస్ గడ్ లో ఉన్న 28 జిల్లాలకు గాను 5 జిల్లాలకు ఈ వైరస్ విస్తరించింది. అందులో కోర్బా జిల్లాలో 74 శాతం కేసులున్నాయి. రాజధాని రాయ్ పూర్ లో 5 కేసులు మాత్రమే నమోదైయ్యాయి.. ఏది ఏమైనా ఇప్పటికైనా కరోనా విస్తరిస్తున్న ప్రాంతాల్లో తగినంతగా కట్టుదిట్టమైన కఠిన చర్యలతో మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చు.. లేకుంటే రానున్న వర్షాకాలం.. చలికాలంలో ఇంతకంటే ఎక్కువగా నష్టాలను చూసే అవకాశం ఉందంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: