ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు బతికే పేద వారిని సరిగా పట్టించుకోవటం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. వైరస్ వల్ల అనేక మంది పేదవాళ్ళు తమ జీవనోపాధిని కోల్పోయి కుటుంబాలను పోషించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడంతో పాటుగా లాక్ డౌన్ గట్టిగా అమలు చేయడంతో ఇంటి నుండి బయటకు వెళ్ళలేక పోతున్నారు.

 

ఇలాంటి సమయంలో కార్మికులను వలస కూలీల ను ఆదుకోవడానికి ప్రభుత్వ సంక్షేమ బోర్డు ద్వారా పది వేలు ఇవ్వాలని లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. వలస కార్మికులకు పునరావాసం ఆర్థిక సాయం చేయాలని... రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలని కోరారు. రైతుల పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇలా ప్రజల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ తమ గళం విప్పుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. ఇవాళ పార్టీ నాయకులతో క్యాడర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గాని...జనసేన ఇప్పటిదాకా సరైన విధంగా కరోనా వైరస్ విషయంలో పేదల పట్ల పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టి అసలైన ఈ సమయంలో ప్రశ్నించకుండా... కామ్ గా పవన్ కళ్యాణ్ వండటం పద్ధతి కాదు అని చాలామంది అంటున్నారు.  



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: