తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు గ‌త కొంత‌కాలంగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. త‌న‌దైన శైలిలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హిస్తున్న ఆయ‌న వివిధ కామెంట్ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఎన్నారైల‌తో ఆయ‌న అనుసంధానం అయ్యారు. వివిధ అంశాల‌పై స్పందించారు. దీనిపై, నార్త్ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండాలని, మీరందరూ కూడా స్దానికంగా ఉండే ప్రభుత్వాల సూచనలు పాటించాలని,జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.

 


`ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అవిశ్రాంతంగా పనిచేస్తూ కరోనా నుంచి మీ కుటుంబాలను కాపాడేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి మీ కుటుంబాలకు జగన్ గారి ద్వారా పూర్తి భరోసా ఉందని చెబుతున్నాను. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ఆర్ఐలను ఉద్దేశించి గంటన్నరపాటు జూమ్ యాప్ ద్వారా మీటింగ్ పెట్టాడు. అది మినీ మహానాడులాగా ఉంది. అందులో చంద్రబాబును,ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుసంపాదించుకున్నవారు మాత్రమే ఉన్నారు. అందులో సామాన్య ఎన్ఆర్ఐలు ఎవరూ పాల్గొనలేదు.`` అని ప్ర‌భాక‌ర్ అన్నారు.

 


``చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఎటువంటి క్రైసిస్ మేనేజ్ చేయలేదు.నేడు సైతం ప్రతిపక్షనేతగా ఉంటూ వేరే రాష్ర్టంలో ఉంటూ ఇక్కడ పరిస్దితులను మానిటర్ చేసే ఆయనకు ఏ తెలివిఉన్న ఎన్ఆర్ఐ వచ్చి ఆయనతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడు. తను ఏం చేశాడంటే నిన్న ఒక ప్లాన్డ్‌గా టీడీపీ వారందర్ని లాగిన్ చేసుకుని జూమ్ యాప్‌లో పాల్గొన్నాడు. ఆ మీటింగ్‌లో పాల్గొన్నవారిలో చాలామంది కూడా చంద్రబాబు ఉద్దేశించి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేది. మీరే ఇప్పటి ముఖ్యమంత్రి అని అన్నారు. వారు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్ధం ఉందా? ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా?`` అని నిల‌దీశారు.

 

గత ఎన్నికలలో ఏపీ ప్రజలు 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును ఛీ కొట్టారు. ``ఎన్నికలలో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి ఎలా అవుతాడు. ఎమ్మెల్యేల‌ను కొంటారా... కొనండి... గతంలో మీరు సంతలో కొన్నట్లు కొంటారా? అదేనా పధ్దతి. లేకుంటే నిన్న ఆయనతో పాటు వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్న టీడీపీ ఎన్ఆర్ఐలందరూ కలసి చంద్రబాబును ఆయా దేశాలకు తీసుకుపోయి అక్కడ చేయండి ముఖ్యమంత్రిని. చంద్రబాబు అందుకు సమర్ధుడే. ఏమైనా అర్ధం ఉందా...ప్రజలందరూ ఈ రాష్ర్టాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ముందుకు నడిపించగలడు. విడిపోయిన రాష్ర్టం ఉన్న పరిస్దితులలో అన్ని వర్గాలకు తన నవరత్నాల ద్వారా న్యాయం చేయగలడని 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ సానుభూతి పరులందరూ వీడియోకాల్‌లో ఉండి చంద్రబాబుకు భజన చేస్తారా...విదేశాలలో ఉన్నారు...అంతో...ఇంతో చదువుకుని కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఆ మాత్రం కూడా తెలియదా?`` అని ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: