కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు హ‌ర్యాన ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేమంటే రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా టెస్టులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. దీనివ‌ల్ల క‌రోనా ఉన్న‌వారిని గుర్తించేందుకు తొంద‌ర‌గా వీలు క‌లుగుతుంద‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే ఆదిశగా హర్యానా ప్రభుత్వం చ‌ర్య‌లు ఆరంభించింది. వాస్త‌వానికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ముంబైలోని ధారవిలో డోర్ అటు డోర్‌గా కుటుంబాలన్నింటికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. అలాగే చండీగఢ్‌లోనూ, తమిళనాడులోని తిరుచ్చిలోనూ , పూణెలోని కొన్ని ప్రాంతాలలో, కేరళలోని పత్తనమిట్టలో ఇలాంటి పద్ధ‌తిని అవ‌లంభించారు. అయితే ఒక రాష్ట్రం ఈ తరహా ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి.   

 

ఇదిలా ఉండ‌గా 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో 2 కోట్ల 30 లక్షల మంది ఉన్నారు.  ప్రాథ‌మిక స్థాయిలో ఉన్న‌వారికి సంబంధించిన వారిలో క‌రోనా బ‌య‌ట‌ప‌డ‌ద‌ని ఐసీఎంఆర్ గుర్తు చేసిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర్యాపిడ్ టెస్టుల‌పై రెండు రోజుల క్రితం ఐసీఎంఆర్ అధికారులు స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. క‌రోనా తుది ఫ‌లితంగా మాత్రం భావించ‌వ‌ద్ద‌ని తెలిపారు. మ‌రి నిజంగానే క‌రోనాను నియంత్ర‌ణ చేయాలంటే  ప్రజలందరికీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా? ఆ లెక్కన దేశమంతటా చేయాలంటే 130 కోట్ల మందిని పరీక్షించాలంటే సాధ్యమవుతుందా? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

 


కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ప్ర‌పంచం మొత్తం యుద్ధం చేస్తోంది. క‌రోనాను అరిక‌ట్టేందుకు ఏదేశ ప్ర‌య‌త్న‌మూ ఆదేశం చేస్తూనే ఉన్నాయి. అయినా ఈ మ‌హ‌మ్మారి లొంగ‌డం లేదు. ఈ దిక్కుమాలిన క‌రోనా ర‌క్క‌సికి మందు లేదు..మాకు లేదు.. నిత్యం వేలాది మందిని భూమండ‌లంపై పొట్ట‌న‌బెట్టుకుంటోంది. దీనిని అంత‌మొందించ‌డానికి లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మా..? అంటే కాద‌న్న స‌మాధానమే చాలామంది శాస్త్ర‌వేత్త‌ల నుంచి వ‌స్తోంది. శాస్త్ర‌వేత్త‌లు ఓవైపు రేయిభ‌వ‌ళ్లు క‌రోనాకు మందు క‌నుగోనేందుకు శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని ప్ర‌యోగాలు స‌క్సెస‌యిన క్లినిక‌ల్ రీసెర్చ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: