దేశంలో కరోనా మహమ్మారి మనిషికి ప్రాణ సంకటంగా మారింది.  ప్రతిరోజు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది.  ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 16116 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 1324 కొత్త కేసులు నమోదు కాగా..31 మంది మరణించారు. ముఖ్యంగా ఈ కరోనా కేసులు ఎక్కువగా మహరాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది. 

 

ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకోని 2302 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  కరోనా సోకి  ఆదివారం సాయంత్రం వరకు భారత్‌లో 519 మంది మృతి చెందారు.  ఇప్పుడు కరోనా తమిళ నాట కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇవాళ కొత్త‌గా 105 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  ఈ కేసుల‌తో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1477కు చేరుకుంది.  ఇప్ప‌టివ‌ర‌కు 15 మంది మృతి చెందార‌ని వైద్యారోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది.  తమిళనాడు లో కరోనా ప్రబలి పోతుందని చెబుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ ప్రజలు యదేచ్చగా తిరుగుతున్నారు. 

 

 

ఇటీవల జల్లికట్టులో పాల్గొనే ఓ యెద్దు చినిపోగా వందల మంది గుంపులుగా వచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు... అంతే కాదు సామూహిక బోజనం చేశారు. ఇలా కరోనా పై ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నా.. ప్రజలకు ఎంత చెబుతున్నా లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా తమిళనాడులో పెరిగిపోతున్న కరోనా కేసులను చూసి అక్కడ ప్రజలు భయపడుతున్నారు.  రాష్ట్రంలో క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోనే ఉండి..స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని పోలీసులు, అధికారులు   అన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: