ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా  భయమే కనిపిస్తోంది. కరోనా రక్కసి  ప్రపంచాన్ని వణికిస్తోంది . చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తోంది. పాపాత్ములను చంపడానికి వచ్చింది ఈ కరోనా  అని కొంతమంది అంటే ఇది మానవ తప్పిదాల వల్లే వచ్చిందని కొంతమంది అంటున్నారు... ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి వ్యాధి వచ్చే భూమిని శుద్ధి  చేస్తుంది అని అంటున్నారు ఇంకొంతమంది. ఏది ఏమైనా ఈ మహమ్మారి కారణంగా మనుషుల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. కఠిన నిబంధనలు తీసుకు వచ్చిన ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా తప్పడం లేదు. 

 

 

 ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ పాకుతూ  చివరికి మృత్యువు దరికి  చేరుస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే ముందుగా ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు శరవేగంగా వ్యాప్తిచెంది ఎంతో ప్రాణ నష్టం కలిగిస్తున్నా తరుణంలో...  చైనా దేశంలో ఒక్కసారిగా వైరస్ వ్యాప్తి తగ్గిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అగ్రరాజ్యాల శాస్త్రవేత్తలు సైతం ఈ ప్రపంచ మహమ్మారికి విరుగుడు కనుగొన లేక పోతే అగ్రరాజ్యాల అధ్యక్షులు కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి తనకు సహాయం కావాలంటూ  అర్థిస్తుంటే... అలాంటిది చైనా దేశం మాత్రం కరోనా ను  ఎలా కట్టడి చేయగలిగింది అనే అనుమానాలు అందరిలో రేకెత్తుతున్నాయి. 

 

 

 ముఖ్యంగా చైనా కావాలనే ఇలాంటి  వైరస్ ను  సృష్టించి ప్రపంచ దేశాలను నాశనం చేయాలని అనుకుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని ప్రస్తుతం చిగురుటాకులా వణికిపోతున్న ఈ మహమ్మారి వైరస్ ను చైనాలోని వ్యూహం ల్యాబ్లోనే సృష్టించారు అనే వాదన ప్రస్తుతం ఎంతో బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా  దానంతట అది సృష్టించబడినది కాదని కృత్రిమంగా సృష్టించబడిన వైరస్ అంటూ నోబెల్ బహుమతి గ్రహీత మౌంటెనియర్ ఆరోపించడం ప్రస్తుతం మరో వివాదానికి కారణమైంది. అయితే వైరస్ను ల్యాబ్లో సృష్టించలేమని అదంతా తప్పుడు ఆరోపణలు మాత్రమేనని వుహాన్  వైరాలజీ లాబ్ చీప్  స్పష్టం చేశారు  ఇదిలా ఉంటే అటు ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యమైన ఆస్ట్రేలియా అమెరికా లో కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: