వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన సున్నా వడ్డీ పథకాన్ని నిన్న ఆదివారం రోజున సీఎం వైఎస్ జగన్ పునఃప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఉన్న దాదాపు 1400 కోట్ల వడ్డీ రుణ భారాన్ని వైయస్ జగన్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ నెల 24న ఈ పథకం లాంఛనంగా ప్రారంభమవుతుంది.  

 

ఆంధ్ర ప్రదేశ్ లోని దాదాపు 6.9 లక్షల సంఘాల్లోని మహిళలకు 1000కోట్లు మరియు పట్టణ ప్రాంతంలోని1.8 లక్షల సంఘాల్లోని మహిళలకు 400 కోట్లు చొప్పున సీఎం జగన్ చెల్లించ నున్నారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ చేసిన 24603 కోట్ల రుణ మాఫీ ఇంకా చెల్లించాల్సి ఉంది .ఈ మొత్తాన్ని సీఎం జగన్ ప్రభుత్వం నాలుగు విడతలుగా చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. అప్పటివరకూ  ఆరు నెలల కు ఒకసారి వడ్డీని లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తామని తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: