కొత్తగా కొనుగోలు చేసిన కరోనా కిట్ల ధరల మీద వివాదం నెలకొన్న సంగతి. కరోనా వైరస్ రాపిడ్ కిట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చత్తిస్ ఘడ్ లో కరోనా ర్యాపిడ్  టెస్ట్  కిట్ లను ఒక్కొక్కటి రూ.  337 చొప్పున కొనుగోలు చేయగా... ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్టు ను రూ 730 లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ విధంగా రెండు లక్షల కరుణ టెస్ట్ కిట్లను కొనుగోలు చేయగా అందులో లక్ష కోట్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. ఈ మొత్తానికి గానూ14.60  కోట్లు ఖర్చయింది. ఓ రకంగా చూస్తే  చత్తీస్గడ్ చెల్లించిన ధరకంటే ఏపీ ప్రభుత్వం రెండు రెట్లు చెల్లించినట్లు అయింది.

 

 అయితే మొత్తం ఎనిమిది లక్షల కోట్ల ఏపీ ప్రభుత్వం ఆర్డర్ చేసినట్లు సమాచారం. అందులో 25 శాతం   ధర 14.60  కోట్లు ను ఏపీ ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన డబ్బులు కిట్లు మొత్తం విజయవాడకు వచ్చిన తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం  చెప్పింది కానీ ఇప్పుడు  ఈ ధరపై ప్రభుత్వంకి ఆరోపణలు తలెత్తుతున్నాయి అయితే చత్తిస్ ఘడ్  ప్రభుత్వం రూ. 337 కి కొంటే ఏపీ ప్రభుత్వం రూ.703 కి కొనడం ఏంటి అని ఏపీ ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కరోనా  ర్యాపిడ్ కిట్లను చత్తీస్గడ్ గవర్నమెంట్ ఏ రేటుకు కొనడం జరిగిందో అదే  రేటు తాము కూడా చెల్లిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: