ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనా  వైరస్ అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ చవిచూడని ముప్పును అమెరికా దేశం ప్రస్తుతం కరోనా వైరస్ రూపంలో ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికి కరోనా వైరస్ తో పోరాటం చేయలేకపోతుంది అమెరికా. క్రమశిక్షణ గల ప్రజానీకం అత్యాధునిక వైద్య సదుపాయం ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలను మాత్రం కాపాడలేక పోతుంది. కరోనా ప్రళయం అమెరికా దేశం పై విజృంభిస్తోంది. అమెరికాలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వందలు నుండి  వేల దగ్గరికి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా  వైరస్ ఎక్కువగా ఉన్న దేశం అమెరికా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 

 

 ఇక తాజాగా జరిగిన ఘటన అమెరికా లో ఎంతటి దుస్థితికి ఉందో ప్రత్యేకంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మామూలుగా అయితే చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ వార్తాపత్రికలలో పలు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. కూడా వార్తాపత్రికలలో ఏదో చివర కనిపిస్తూ ఉంటుంది. లేదా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఒక పేజీ మొత్తం నివాళులర్పిస్తున్న ఫోటోలు పెడతారు. కానీ అమెరికాలోని బోస్టన్ న్యూయార్క్ లో మాత్రం... కేవలం కరోనా  వైరస్ ద్వారా మరణించిన వారికి స్మృత్యంజలి శ్రద్ధాంజలి పేరిట ఏకంగా దినపత్రికలో 15 పేజీల కేటాయించారు అంటే అమెరికాలో పరిస్థితి  ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్  ద్వారా మరణించిన వారి పూర్తి వివరాలతో 15 పేజీలలో నివాళులర్పించారు. 

 

 

 అమెరికాలో నెలకొన్న దారుణ పరిస్థితి కి ఇదే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. అమెరికాలో కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక అమెరికాలోని ఈ మహమ్మారి ప్రభావం మసాచుసెట్స్ లోనూ చూపుతోంది. ఇప్పటి వరకు అక్కడ 36 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 15 వందల మంది వరకు మృత్యువాత పడ్డారు. దీంతో మరణించినవారి సంస్మరణ ప్రకటనల కోసం ఏకంగా అక్కడి ఓ దినపత్రిక పదిహేను పేజీలు కేటాయించడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే గత వారం నాటి సంచికలో 11 పేజీల కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాలో వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ న్యూజెర్సీలోని దినపత్రికల్లో మరేలా ఉంటుందో అని తలుచుకుంటేనే భయాందోళనలకు గురావాల్సిన  పరిస్థితి ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: