స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో వాయిదా పడ్డాయి. కరోనాకు ఎన్నికలకు లింక్ ఉంది. ఆ పేరిట మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనీసం ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలను వాయిదా వేశారు. ఇది జగన్ తో సహా మొత్తం సర్కార్ ఆగ్రహానికి కారణమైంది.

 


ఆరు వారాల గడువు తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని నాడు మీడియా ముఖంగా నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. అయితే ఇపుడు చూస్తే కరోనా వైరస్ ఏపీలో గట్టిగానే ఉంది. ప్రధానంగా మూడు నాలుగు జిల్లాలలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

 

ఈ నేపధ్యంలో మే నెలలో లాక్ డౌన్ రెండవ విడత కూడా పూర్తి అవుతుంది. మరి అపుడైనా ఎన్నికలు పెట్టడానికి వీలు ఉంటుందా అన్నది ఇపుడు చర్చగా ఉంది. దీని మీద జగన్ ఉన్నతాధికారులతో ఈ సరికే మాట్లాడినట్లుగా ప్రచారం సాగుతోంది.

 

మే 3తో లాక్ డౌన్ పూర్తి అవుతుందని, ఆ తరువాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి అప్పటికి కరోనా ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఏవరికీ తెలియదు, వైద్య రంగ నిపుణుల మాటలను బట్టి చూస్తూంటే కరోనా వైరస్ ప్రభావం జూన్ వరకూ ఉండవచ్చునని అంటున్నారు. 

 

మరో వైపు చూసుకుంటే ఒకవేళ కరోనా నెమ్మదించినా కూడా ఎన్నికలకు అంత తొందరగా వీలు అవుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. అయితే దక్షిణ కొరియాను జగన్  ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు.

 

ఆ దేశంలో కరోనా వున్నా కూడా 300 సీట్ల జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు ఈ మధ్యనే నిర్వహించారని చెబుతున్నారు. అదే తీరున ఇక్కడ కూడా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించి ఒక పని పూర్తి చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. మరి ఇదెంతవరకూ ఆచరణలో సాధ్యపడుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: