రంజాన్ నెల మరొక వారం రోజుల్లో మొదలవుతుంది. అలాగే ప్రతి ఆదివారం క్రైస్తవులు ప్రార్థనా మందిరాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా దేవాలయాలు అయితే పూర్తిగా మూతపడ్డాయి. అదీ కాకుండా ముస్లింలకు చాలా ఇష్టమైన పర్వదినం రంజాన్ కూడా ఈసారి వారు సంపూర్ణంగా మరియు సంతృప్తిగా అందరితో కలిసి సంతోషంగా జరుపుకునే వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం కూడా తెలిసిందే. అయితే భక్తుల పోకడ లేక బాగా ఆదాయం కోల్పోయిన వీటన్నింటినీ ఉత్తేజపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

 

కోవిడ్ 19 వల్ల రాష్ట్రంలో ఆదాయం కోల్పోయిన అన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు మరియు చర్చిలకు ఐదు వేల రూపాయలు నగదును ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రంజాన్ మాసం రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునేలా పిలుపు ఇవ్వాలని తాను అడిగిన విధంగా ఒప్పుకున్న ముస్లిం మత పెద్దలు కూడా అయినా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

 

ఇకపోతే కరోనా లాక్ డౌన్లోడ్ వల్ల ప్రతిరోజు రాష్ట్రం 150 కోట్ల ఆదాయం కోల్పోతున్నట్లు చెప్పిన జగన్ ఇలాంటి పరిస్థితుల్లోనూ తమ బాధ్యతను తాము మర్చిపోమని మరియు క్లిష్టపరిస్థితుల్లో కూడా ఆర్థిక సహాయం చేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు. అలాగే గత ఏడాది సాయం అందుకున్న అన్నీ స్థలాలకు డబ్బులు అందుతాయని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక్కరిదో కాదని... సామాజిక - కుల - మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతృప్తికరమైన జీవితం గడపాలన్నదే తమ ధ్యేయం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: