ప్ర‌ముఖ సెర్చింజ‌న్ దిగ్గ‌జం త‌న ఆవిష్క‌ర‌ణ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. గూగుల్ మ‌రో వినూత్న సేవ‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. ఇంటర్నెట్‌తో పాటు ఆర్థిక సేవల్లోనూ దూసుకెళ్తోన్న గూగుల్‌.. త్వరలో స్మార్ట్‌ డెబిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. గూగుల్ పే మొబైల్ వ్యాలెట్‌కు అనుసంధానంగా ఈ డెబిట్ కార్డును తీసుకురానుంది. ఇందుకు గాను సిటీ బ్యాంక్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

 

గూగుల్ కార్డ్ రెండు రూపాల్లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది. ఫిజిక‌ల్‌, వ‌ర్చువ‌ల్ రూపంలో ఈ గూగుల్​ కార్డును యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు. అతి త్వ‌ర‌లోనే బిగ్ స‌ర్‌ప్రైజ్‌గా గూగుల్ ఈ కార్డును లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ కార్డ్‌పై గూగుల్ ఇప్ప‌టికీ ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. దీనిపై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, ఈ సేవలు వినియోగదారులకు ఎంతో సర్​ప్రైజ్​ ఇవ్వడం ఖాయం.

 

ఇదిలాఉండ‌గా, గూగుల్ ఈ-లెర్నింగ్ అనే సరికొత్త విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి విద్యార్థులకే కాకుండా బోధనా సిబ్బంది (టీచర్స్)కి కూడా అనుకూలమైన ఫీచర్. ఇప్పటివరకూ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే పాఠాలు అందుబాటులో ఉండేది. ఇప్పుడు భాషతో ఇబ్బంది పడకుండా తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాళీ వంటి పలు ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ సంస్థ పేర్కొంది. వీటిని మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యంతో వినవచ్చు. ఇందులో ‘గూగుల్ మీట్’ సదుపాయం ఉంది. దీని ద్వారా ఒకేసారి 250 మంది టీచర్స్, స్టూడెంట్స్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ యాప్‌కు ‘గూగుల్ బోలో’ అనే పేరు పెట్టారు. నిజానికి ఈ యాప్‌ని ఈ ఏడాది చివరిలో తీసుకు రావాలనుకున్నా.. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో.. పిల్లల సమయం వృధా కాకుడాదని ఇప్పుడు తీసుకువచ్చారు. గూగుల్ ప్లే స్టోర్‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: