ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టైలే వేరు. మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని అందరికీ తెలిసినదే. సరిగ్గా ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఏ విధంగా నెరవేరుస్తారో అదే విధంగా తాను  ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఎవరైతే తనని తన పార్టీ క్యాడర్ ను ఇబ్బందులకు గురి చేయటం జరిగిందో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రిందట వైయస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో తనని పోలీసులు ఆపిన సమయంలో.. రెండే రెండు సంవత్సరాలు తిరిగి నేను అధికారంలోకి ఖచ్చితంగా వస్తాను ఎవరిని విడిచిపెట్టను అని అప్పుడు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఇచ్చిన వార్నింగ్ ని ఇప్పుడు సరిగ్గా టైం రావడంతో ఒక్కడినే టార్గెట్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఆధారం చేసుకుని అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారులు వైసిపి నాయకులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగిందో వారందరినీ ఏకిపారేస్తున్నారు. అధికారంలోకి రావటం రావటమే.. ఎన్నికల టైంలో మరియు పాదయాత్ర టైమ్ లో ఇంటిలిజెంట్ బ్యూరో ఏబీ వెంకటేశ్వరరావు పై వేటు వేశారు. మొదట కేసు వేసి సస్పెండ్ చేసి తర్వాత సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు లో దేశద్రోహం గా అవకతవకలకు ఏబీ వెంకటేశ్వర పాల్పడినట్లు భావించి చర్యలు తీసుకున్నారు. కెరియర్ పరంగా కోలుకోలేని విధంగా ఏబీ వెంకటేశ్వరరావు కి వైయస్ జగన్ చుక్కలు చూపించాడు.

 

ఇదేవిధంగా మరో అధికారి శ్రీ కృష్ణ కిషోర్ చంద్రబాబు హయాంలో కొంచెం ఎక్కువగా చేయటంతో...జగన్ అధికారంలోకి వచ్చాక శ్రీ కృష్ణ కిషోర్ కొన్ని ఆర్థిక మండలిలో అవకతవకలకు పాల్పడ్డారని సస్పెండ్ చేసి పడేసారు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కూడా అదే స్థాయిలో అదిరిపోయే డోస్ ఇస్తున్నారు జగన్.  కాగా ఈ విధంగా ఎప్పుడో చెయ్యాల్సింది జగన్ అని చాలామంది అంటున్నారు. కొంతమంది సర్ లేట్ అయిన పర్వాలేదు అలాంటి చీడపురుగులు ప్రభుత్వ శాఖల్లో లేకుండా ఇప్పుడైనా పని మొదలు పెట్టావు థాంక్స్ జగన్ అంటూ కొంతమంది చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: