దేశవ్యాప్తంగా కరోనా  వేరస్  విజృంభిస్తుంటే ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు దాదాపుగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో డాక్టర్లు,  హెల్త్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకై పోరాడుతున్నారు. కరోనా  వైరస్ మహమ్మారి తో పోరాడితే చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ... దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు పోయినా లెక్కచేయం  అన్నట్లుగా పోరాటం చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల డాక్టర్లు హెల్త్ వర్కర్ లపై దాడులు జరుగుతున్నాయి. తమ ప్రాణాలను పణంగా పెడుతున్న డాక్టర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదు ప్రజలు. అయితే ఈ విషయం కేంద్రం వరకు వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా  తీసుకుంది. 

 

 

 ఇక హెల్త్ వర్కర్లు డాక్టర్లకు రక్షణ కల్పించేలా కొత్త ఆర్డినెన్స్ ను  జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . హెల్త్ వర్కర్లు,  డాక్టర్ పై దాడి చేస్తే ఇక నుంచి వారికి ఏళ్లు జైలు శిక్ష కాయం అని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది . అయితే తాజాగా దీనిపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్  ఈ చట్టం గురించి పలు ఆసక్తికర విషయాలను వివరించారు. 1897 ఎకడమిక్ డిసీజెస్ చట్టాన్ని సవరిస్తూ... ప్రస్తుతం ఈ కొత్త ఆర్డినెన్స్ ను  తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లపై హెల్త్ వర్కర్ లపై దాడి చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదు అంటూ తెలిపారు. 

 

 

 డాక్టర్లపై దాడులకు పాల్పడిన ఘటనను  నేరంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేసి... 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తామని స్పష్టం చేసారు  మంత్రి ప్రకాష్ జవదేకర్. ఇక ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా డాక్టర్లపై దాడులకు పాల్పడిన నిందితులను 50 వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధించనున్నట్లు తెలిపారు మంత్రి ప్రకాష్ జవదేకర్. ఒకవేళ డాక్టర్లు హెల్త్ వర్కర్ పై తీవ్రమైన దాడికి పాల్పడితే.. ఆ కేసులోని నిందితులకు ఆరు నెలల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. ఒక లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత డాక్టర్ల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డినెన్స్ ను అమలు చేస్తామని తెలిపారు ఆయన. ఒకవేళ హాస్పిటల్ కానీ లేదా క్లినిక్ లకు కానీ నష్టం జరిగే విధంగా దాడులు జరుగుతే... అప్పుడు ఆ మార్కెట్ విలువ ప్రకారం రెండింతల మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: