కరోనా  వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తూ ఎంతో మందిని బలి తీసుకుంటుంది. అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ సరైన విరుగుడు మాత్రం ఇప్పుడు వరకు అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహా మహా శాస్త్రవేత్తలు సైతం ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు  కనుగొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది . అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మహమ్మారి కి విరుగుడు  లేదని కేవలం నివారణ ఒక్కటే మార్గం అంటూ తేల్చి చెప్పడంతో ప్రపంచ దేశాల ప్రజలు ప్రాణభయంతో నే బతుకును వెళ్లదీస్తున్నారు. 

 

 

 ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ బతుకును వెళ్లదీస్తున్నారు. అయితే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం అగ్రరాజ్యాల్లో  మరింత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అత్యాధునిక సదుపాయం క్రమశిక్షణగల ప్రజానీకం... ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ అగ్రరాజ్యాల లో కరోనా  వైరస్ విజృంభిస్తునే  ఉంది. ఇది కొన్ని దేశాలలో అయితే పరిస్థితి చేయి దాటి పోతుంది. అగ్రరాజ్యాల్లో  ఏకంగా కరోనా  వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షకు  పైగానే ఉంది. రోజుకు మరణాల సంఖ్య కూడా పోతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్కు వాక్సిన్  కనుగొనేందుకు పరిశోధనలు మరింత ముమ్మరం చేశాయి అగ్రరాజ్యాలు. 

 

 అయితే అటు ఇంగ్లాండ్ లో కూడా రోజురోజుకు కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  అక్కడి శాస్త్రవేత్తలు కరోనా  వైరస్కు వ్యాక్సిన్ కనుగొన్నారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఈ మహమ్మారి వైరస్ కు మందు కనిపెట్టలేదు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనా  వైరస్కు వ్యాక్సిన్ ను రూపొందించింది. రేపటి నుంచి ఈ వ్యాక్సిన్ను మనుషులు పై ప్రయోగించనున్నారు . అయితే ఇంగ్లాండ్లో రోజురోజుకూ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతున్న తరుణంలో ఇంత త్వరగా కరోనా  వైరస్కు వ్యాక్సిన్ రూపొందించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు సాధారణ పరిస్థితుల్లో  అయితే వాక్సిన్ కనుకొనడానికి  దాదాపుగా 2 నుంచి 3 ఏళ్ల సమయం పట్టేది అని  అక్కడి వైద్యులు తెలిపారు. ఒకవేళ ఈ వ్యాక్సిన్ కరోనా  వైరస్పై సమర్థవంతంగా పని చేస్తే... అది శుభపరిణామం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: