కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

 

ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 983కి చేరుకుందని ప్రకటించారు. అయితే కరోనా వైరస్ సోకి చికిత్స పొందిన వారు గురువారం 29 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 262 మంది డిశ్చార్జ్ చేసినట్లు గుర్తు చేశారు. క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ బాధితులు 663 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించారు

 

ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ విషయానికి వస్తేకరోనా వైరస్ ఏపీని వణికిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

 

గత 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం 955 కేసులు ఉంటే.. వీటిలో 781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 29మంది కరోనాతో చనిపోయినట్లు బులిటెన్ వెల్లడించింది.

 

ఆంధ్ర కరోనా నిర్థారణ పరీక్షల రేసులో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎక్కువ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్ర.. ఏప్రిల్ 23 తేదీ నాటికి 48,032 పరీక్షలు నిర్వహించినట్లు డ్యాష్ బోర్డులో వెల్లడించారు. డ్యాష్ బోర్డు ప్రకారం ఒక్క రోజు వ్యవధిలో 6,520 పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టమవుతోంది.

 

 

ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తక్కువగానూ, మరణాల పరంగా చూస్తే ఎక్కువగానూ ఉండడపై కూడా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.కరోనా బారిన పడి కోలుకున్న వారి పరంగా చూసినా అత్యంత తక్కువ శాతం మంది ఏపీలో ఉండడంపైనా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

 

మొత్తంగా చూసుకుంటే.... నిర్థారణ పరీక్షలు చేసే విషయంలో ఆంధ్ర అందనంత దూరంలో దూసుకుపోతుంటే.... తెలంగాణలో కోలుకున్న పేషంట్ల సంఖ అయితే అద్భుతం. ఆంధ్ర కోలుకున్నవారు తక్కువ.. తెలంగాణ కన్నా చావులు ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: