క‌రోనా వైర‌స్ దాయాది దేశం పాకిస్థాన్‌పై విరుచుకుప‌డుతోంది. ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌గా.... వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. రోజులు గ‌డిచే కొద్దీ పాకిస్థాన్ మ‌రింత‌గా క‌రోనో కోర‌ల్లోకి జారిపోతోంద‌ని అక్క‌డి వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక క‌రోనా ఇక్క‌డ  వైర‌స్ బారిన ప‌డిన వారిలో వైద్యులు కూడా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్థాన్‌లో కరోనా బారినపడ్డ వైద్య సిబ్బంది సంఖ్య 250కు చేరుకుంద‌ని ఆ దేశ వైద్య ఆరోగ్య‌శాఖ శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  అయితే ఇందులో  160 మంది వైద్యులు ఉన్నట్టు పాకిస్థాన్‌ మెడికల్‌ అసోసియేషన్ ప్ర‌క‌టించింది. 

 

మహమ్మారితో బాధపడుతూ పెషావర్‌కు చెందిన  వైద్యుడు మహమ్మద్‌ జావెద్‌ ఇక్బాల్‌ శనివారం చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. దీంతో పాకిస్థాన్లో క‌రోనాతో మృతిచెందిన డాక్టర్ల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు... వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కోసం వైద్య సిబ్బంది చేపట్టిన నిరాహార దీక్ష శనివారం తొమ్మిదో రోజుకు చేరింది. పాకిస్థాన్‌లోని చాలా ప‌ట్ట‌ణాల్లో లాక్‌డౌన్ విఫ‌ల‌మ‌వుతుండ‌టంతో యంత్రాంగం ఆందోళ‌న చెందుతోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్నా జ‌నాలు స్వీయ నియంత్ర‌ణ‌కు ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్నా పాకిస్థాన్‌లో క‌రోనా విల‌యం త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


ఇదిలా ఉండ‌గా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మ‌ర‌ణ మృదంగం కొన‌సాగిస్తోంది.  ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య ఏకంగా 29 లక్షలకు చేరువైంది. అయితే... మొత్తం కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే చోటుచేసుకున్నాయి.  స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో నమోదైన మొత్తం కేసుల కంటే ఇక్కడి కేసులే ఎక్కువగా ఉన్నాయి. ప‌రిస్థితి ఇంత భ‌యాన‌కంగా ఉన్నా అమెరికా మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేత‌కు ఆస‌క్తి చూపుతుండ‌టం విశేషం.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: