ప్లాస్మా తెలిపి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు  సంజీవనిలా మారబోతుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . అయితే ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్  మందును కరోనా  వైరస్  నివారించేందుకు వాడుతున్న విషయం తెలిసిందే . అది కూడా కరోనా  వైరస్ ప్రభావం శరీరంలో ఎక్కువగా ఉండి ఆరోగ్య పరిస్థితి విషమించిన  వారికి మాత్రమే హైడ్రోక్సీక్లోరోక్విన్ 
 మందులు వాడుతున్నారు. మిగతా వారికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో వేరే మందులు వాడుతున్నారు. ఇక కొంతమందిలో  అయితే ఏకంగా కరోనా  వైరస్ దానంతట అదే తగ్గిపోతుంది.. మరికొంతమందికి అతి తక్కువ సమయంలో ఈ మహమ్మారి వైరస్  నుంచి కోలుకున్నారు. 

 


 దీనంతటికీ కారణం వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది అని స్పష్టంగా చెప్పవచ్చు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం కారణంగా తొందరగా కరోనా  వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నవారు వివిధ రకాల మందులు వాడి కరోనా  వైరస్ నుండి కోలుకుంటున్నారు . అయితే గతంలో ప్లాస్మా  తెరఫీ గురించి వైద్యులు ప్రభుత్వానికి అనుమతి కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతర దేశాలలో కూడా ప్లాస్మా  తెరఫీ ద్వారా కరోనా  వైరస్ పై విజయం సాధిస్తున్నారు వైద్యులు. ప్లాస్మా తెరఫీ ఏమిటి అంటే ప్రస్తుతం కరోనా  వైరస్ బారినపడి చికిత్స తీసుకుని కోలుకున్న వారి నుంచి ప్లాస్మా అంటే బ్లడ్  సేకరించి అది వైరస్ బారిన పడిన వారి బాడీలో కి పంపించడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా  వైరస్ ను  నివారించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. 

 


అయితే ఏ గ్రూప్ వారి నుండి సేకరించిన ప్లాస్మా ఆ గ్రూప్ వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ తెరఫీ ద్వారా చాలామంది కరోనా వైరస్  బారి నుంచి కోలుకుంటున్నాను. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్లాస్మా తెరఫీ చేసేందుకు అనుమతి తెచ్చుకుంది. అయితే దేశం మొత్తంగా చూసుకుంటే ఇలా కరోనా వైరస్ బారి నుంచి బయటపడిన వారు కేవలం ఐదు శాతం మంది మాత్రమే ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారని... చెబుతున్నారు నిపుణులు. మరి ఇది ప్రామాణికమా అంటే ప్రామాణికం కాదు అంటున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. అయితే ప్లాస్మా తెరఫీ తో కూడా వందకి 100% సక్సెస్ అవ్వొచ్చు అని చెప్పడం కూడా కష్టమే. ఇది కేవలం కరోనా  పోరాటంలో భాగంగా ఒక ప్రయత్నమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: