దేశవ్యాప్తంగా కరోనా  భయం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే కరోనా  వైరస్ లక్షణాలు ఎవరిలో అయిన కనిపిస్తే చాలు భయంతో ఊగిపోతున్నారు జనాలు. వాళ్లేదో  రాక్షసులు అన్నట్టుగా చూస్తున్నారు. వారి నుంచి దూరంగా పారిపోతున్నారు. కరోనా  వైరస్ సోకి  చికిత్స తీసుకుని మహమ్మారి బారినుంచి కోluకున్న వారిని చూసి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుందన్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు కరోనా వైరస్ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. 

 

 

 ఇకపోతే తాజాగా రాష్ట్ర ప్రజలందరికీ ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కరోనా గురుంచి  ప్రజలు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని క్రమక్రమంగా కరోనా  వైరస్ను జయిస్తున్నామని... అంతేకాకుండా దేశంలోనే కరోనా  వైరస్ ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెస్ట్  అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

 

 

 ఇక రాష్ట్రంలో కరోనా  వైరస్ బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని చాలా మంది ఈ మహమ్మారి బారినుండి  కోరుకుంటున్నారు అంటూ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్టులు చేపట్టినట్టు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా కరోనా వైరస్ వచ్చిన వారిపై ప్రజలెవ్వరూ వివక్ష చూపించవద్దు అంటూ ఈ సందర్భంగా సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరోనా  వైరస్ సోకిన వారిని కూడా సాటి మనిషి లాగానే చూడాలని వారిని అవమానించేలా ప్రవర్తిస్తూ వివక్ష చూపించవద్దు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. డాక్టర్లు కూడా కరోనా  వైరస్ రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: