మనిషికి ప్రకృతి ఎన్ని పాఠాలు బోధించిన తన స్వభావాన్ని మార్చుకోకుండా ఎప్పటిలాగే విర్రవీగుతూ జీవిస్తాడు.. ఈ భూమి మీద మానవాళి అవతరించిన నాటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు చోటు చేసుకున్న మార్పులు అన్నీఇన్నీ కావు.. మనుషుల్లో మార్పు, వారి జీవన విధానంలో మార్పు.. ప్రకృతిలో మార్పు.. ఇవన్ని కూడా మానవుని సగటు ఆయుర్దానికి గొడ్దలి పెట్టులా మారిపోయాయి.. ఒకప్పుడు 150 సంవత్సరాల వరకు దృడంగా జీవించిన మనిషి ఇప్పుడు కనీసం 50 సంవత్సరాలు దాటితేనే సర్వరోగాలకు నిలయంగా మారి జీవితాన్ని భారంగా సాగిస్తున్నాడు.. ఇదంతా మనిషి తప్పిదమే..

 

 

ఇకపోతే ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా.. ఎన్ని రకాలుగా రక్షణ చర్యలు తీసుకుంటున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా, 2 లక్షల మందికి పైగా మరణించారు. కాగా ఈ కరోనా వైరస్ విజృంభణ ఆగకపోతే మాత్రం ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. అదేమంటే కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే మరో 3 నెలలో ఆకలి చావులు తప్పవని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రతినిధులు పేర్కొంటున్నారు... కరోనా వల్ల ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితికి ఇచ్చే నిధుల్లో కోత విధించడం దురదృష్టకరం అంటున్నారు..

 

 

మరోవైపు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా 10 కోట్ల మందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో మూడు కోట్ల మంది తాము ఇచ్చే ఆహారంపై ఆధారపడ్డారని వారు తెలిపారు. ఇలా ఎంతో మందికి సమయానికి ఆహారం అందించకుంటే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో పేదల జీవితాలు దుర్బరంగా తయారయ్యాయి. వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. రోజూ కూలీ చేసుకునే జనం అల్లాడిపోతున్నారు. ఈ వైరస్ వల్ల ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఆదాయ మార్గాలు లేక దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు మూత పడ్డాయి.

 

 

దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నిత్యవసరాలు దొరకని పరిస్థితి నెలకొంది. తిండి లేక కొందరు కప్పలను తింటుండగా, మరికొందరు కుళ్లిపోయిన అరటిపండ్లను తింటూ వారి ఆకలిని తీర్చుకుంటున్నారు.. చాలా ఘోరమైన దుస్థితి దాపురించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇవే గాక మన కంటికి కనిపించకుండా ఎన్నో దారుణాలు ఆకలితో చోటు చేసుకుంటున్నాయి.. మరి రాబోయే ఈ పరిస్దితిని ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయో...?

మరింత సమాచారం తెలుసుకోండి: