జగన్ కి ఏపీలో మద్దతు ఉందా. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను అదే పనిగా విమర్శించడమే కదా రాజకీయ పార్టీల పని. ఏపీలో వైసీపీ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. అది ఎన్నికల ముందు కూడా అలాగే సాగింది. ఇపుడు అంతే. అయితే నాడు ముసుగులు ఉన్నాయి. ఇపుడు తొలగించి అంతా చేతులు కలిపారు.

 

ఇదిలా ఉండగా జగన్ ఒక మాట అంటే చాలు చంద్రబాబు రివర్స్ అవుతారు. అది కాదు అని ఎదురు దాడి చేస్తారు. ఆయన వెనకాలే మిగిలిన పార్టీలు కూడా తందానా అంటాయి. ఈ పార్టీలు అన్నీ కూడా జగన్ ఏది చెప్పినా తప్పు అనేయడమే నేర్చుకున్నాయి. ఏపీలో కరోనాతో కలసి జీవించడం తప్పదు అని జగన్ అంతే అంతా ఇంతా చేసి రాజకీయ రాధ్ధాంతం చేశాయి. అదే మాట ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే మాత్రం ఎవరూ కనీసం పట్టించుకోలేదు.

 

 ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలనే అన్ని దేశాలు పాటిస్తున్నాయన్న కనీస ఆలోచన కూడా చేయలేకపోతున్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ కొన్ని మాటలను మీడియా ముఖంగా చెప్పారు. అవేంటి అంటే ఏపీలో కరోనాని చూసి భయపడవద్దు. అది మామూలు జ్వరం లాంటిదే. అదేదో మహా పాపమని భయపడవద్దు, ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దు అని.

 

నిజంగా ఇది జగన్ ఇంటి పెద్దగా, తండ్రిగా చెప్పారు. ప్రజలను భయపెట్టి ఆ విధంగా వారిని వత్తిడిలో పెడితే కరోనా ఇంకా విస్తరిస్తుంది. వారికి వారే పిరికివారై దొరికిపోతారు. మానసిక వేత్తలు సైతం ఇదే చెబుతున్నారు. వ్యాధిని ఎదుర్కోవాలి. అంతే తప్ప భయకంపితులుగా  జనాలను చేయరాదు. ఇప్పటికే కరోనా వస్తే మరణం అనుకుని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు.

 

ఇదే విషయాన్ని ఒక మీడియా డిబేట్ లో సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కూడా చెప్పారు. జగన్ చెప్పింది కరెక్టేనని ఆయన మద్దతుగా మాట్లాడారు, ఇంట్లో పిల్లాడికి జబ్బు వస్తే ఏ తండ్రి అయినా తగ్గిపోతుంది, భయమక్కరలేదు అని అంటారు. అదే జగన్ కూడా చెప్పారని కూడా ఆయన చెప్పారు అని జేడీ సమర్దించారు. 

 

ఇక కరోనాతో సహజీవనం చేయడం శరణ్యం అని జగన్ చెప్పినదాన్ని కూడా వక్రీకరించడం పైన కూడా మేధావులు తప్పుపడుతున్నారు. జగన్ చెప్పింది కరెక్ట్ అంటున్నారు. జేడీ ఈ విషయంలోనూ అది నిజ‌మే అంటూ జగన్ కి సపోర్ట్ గా మాట్లాడారు. కరోనాకు వ్యాక్సిన్ లేదు, అందువల్ల అది దొరికేంతవరకూ మనమంతా కరోనాను జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు వేయాలని జేడీ అన్నారు. మొత్తం మీద జేడీ లాంటి వారు జగన్ మాటలను అర్ధం చేసుకున్నా టీడీపీ ఇతర పార్టీలు మాత్రం తప్పుడు భాష్యం చెప్పడం పట్ల వైసీపీ నేతలు మండిపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: