తెలంగాణ రాష్ట్రంలో మొన్నటివరకు కరోనా వైరస్ పంజా విసిరిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో కేసులు పెరిగిపోవడంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో లాక్ డౌన్  కూడా అమలు కావడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజానీకం. లాక్ డౌన్  సమయంలో ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వగా  పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి మరి పోరాటం చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. 

 

 

 ప్రజలందరూ ఇంటికే పరిమితమైతే పోలీసులు అందరూ తమ కుటుంబాన్ని విడిచి రోడ్డు మీద తిరుగుతూ ప్రజలను బయటకు వస్తే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇంటికి పంపించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే విధి నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ... ఎక్కడ వెనకడుగు వేయకుండా పోలీసులు విధి నిర్వహణలో మునిగిపోయారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే కొంత మంది పోలీసులకు విశ్రాంతిని ఇచ్చేలా తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

 

 

 తెలంగాణలో పోలీస్ శాఖ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హోంగార్డు నుంచి డిజిపి వరకు ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ అధికారుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి డ్యూటీలను  కేటాయించాలంటూ ఆదేశించింది కేసీఆర్ సర్కార్. అంతేకాకుండా పోలీసుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి ట్రాఫిక్,  భద్రత విధుల  విషయంలో కూడా మినహాయింపు ఇవ్వాలి అంటూ సూచించింది.  కాగా ప్రస్తుతం అందరికీ ఒకే తరహాలో డ్యూటీలు  వేస్తుండగా త్వరలో ఈ పద్ధతిలో మార్పు రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: