కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా దేశం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలావరకు ప్రాణనష్టం ఆర్ధిక నష్టం జరిగింది. డ్రాగన్ దేశం కుట్రతో కరోనా వైరస్ ని ప్రపంచం మీదకి వదిలింది అని చాలామంది ముందు నుండి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చెలాయించడానికి చైనా ఆడిన డ్రామా ఈ కరోనా వైరస్ అని ఇతర దేశాలకు చెందిన నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ నీ చైనా వైరస్ గా అభివర్ణించడం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఈ వైరస్ ఇండియాలో చొరబడి చాలా మందిని బలి తీసుకోవాలని చైనా చేసిన కుట్రలో భాగమన్న వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా చైనా మీద మోడీ బ్రహ్మాస్త్రం వదులుతున్నారు.

 

అదేమిటంటే చైనా దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం కావటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిసే విధంగా మోడీ సరికొత్త ప్లాన్ వేశారు. చైనా ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉండటానికి కారణం విదేశాలకు చెందిన పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు అక్కడ పెట్టుబడులు పెట్టడం. ఇటువంటి పరిస్థితుల్లో చైనా పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఉండటంతో చాలావరకు చైనా దేశంలో విదేశాలకు పెట్టినా కంపెనీలన్నీ తీసివేయడం జరిగింది.

 

చైనా లో ఏ కంపెనీలు అయితే తీసివేయడం జరిగిందో వాటిపై ప్రస్తుతం మోడీ దృష్టి సారించారు. అవి ఇండియాలో నెలకొల్పడానికి మంతనాలు జరుపుతున్నారు. సదరు విదేశీ కంపెనీల పెట్టుబడి దారులు కూడా ఇండియా అంటే నమ్మకం కలిగిన దేశం అని, పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో త్వరలో పెద్ద ఎత్తున దేశంలో పరిశ్రమలు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో  కేంద్రం త్వ‌ర‌లో పెట్టుబ‌డి దారుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వారికి తగినంత సహాయం చేసేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీల‌ను ప్రకటించాలని ఆలోచిస్తున్నట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: