మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విజృంభించిన కరోనా  ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు కరోనా  హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆరు కొత్త పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి అంటూ ఈటల రాజేందర్ తెలిపారు. ఈరోజు  వైరస్ బాధితులు 22 మంది ని డిస్టర్బ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్ల కరొనా  కేసులు తగ్గాయని ఆయన తెలిపారు. తెలంగాణలో కేసులను తక్కువగా చూపుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలపై మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 కరోనా  టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపిన ఈటెల.... టెస్టులు  చేయకపోవడం వల్ల తక్కువ కేసులు నమోదవుతున్నాయి అంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు అంటూ తెలిపారు.లాల్ డౌన్  సంపూర్ణంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఈ సందర్భంగా మంత్రి ఈటల తెలిపారు.  వైరస్ లక్షణాలు ఉంటేనే టెస్ట్ లు చేయాలనీ  ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ఇచ్చిందని దాని ప్రకారమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని  ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 

 

 

 అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 464 మంది కరోనా వైరస్ బాధితులు డిశ్చార్జి అయ్యారు అంటూ  తెలిపిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.... ప్రస్తుతం రాష్ట్రంలో 552 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఒక్క సారిగా కేసులు పెరిగి పోవడానికి మర్కజ్  లింకే  కారణం అంటూ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన  మొత్తం కేసుల్లో  44 శాతం మందికి పైగా డిశ్చార్జి అయ్యారు అని.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు అంటూ  మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: