మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందస్తు జాగ్రత్తలు ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ... రోజురోజుకు మహమ్మారి వైరస్ బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో బతికింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న నిబంధనలు మరింత కఠినతరం చేయడంతో... ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దీంతో తెలంగాణ ప్రజానీకం కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పటికీ నమోదవుతున్న కేసులు కొంతమంది నిర్లక్ష్యం కారణంగానే అన్న విషయం తెలిసిందే. 

 

 

 కొంతమంది కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకునేందుకు నిరాకరించడంతో వారీ  కారణంగా చాలామంది కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడాల్సిన  దుస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన చాలా కేసులు ఇలా ఇతరుల నిర్లక్ష్యం కారణంగానే అని చెప్పవచ్చు. ఎవరో  చేసిన  తప్పుకు ఇతరులు  బలి కావాల్సిన  పరిస్థితులు వస్తున్నాయి. అయితే నిన్న తెలంగాణలో మొత్తం ఆరు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ ఆరు పాజిటివ్ కేసుల్లో  ఐదు పాజిటివ్ కేసులు రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఈ ఐదు పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోని చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడానికి కారణం ఒక పల్లీల  వ్యాపారి అని అధికారులు గుర్తించారు. సరూర్ నగర్ లోని మలక్పేట్ కు చెందిన ఓ పల్లీల వ్యాపారి కారణంగా  ఐదు కరోనా  కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఆ పల్లీల వ్యాపారి కుటుంబ సభ్యులందరినీ వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా వారందరికీ వైరస్  సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక వైరస్ బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: