కరోనా వైరస్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముందు నుండి ఇది చైనా వైరస్ అని అభివర్ణిస్తున్నారు. డ్రాగన్ దేశం కావాలని ప్రపంచం పైకి కరోనా వైరస్ ని రిలీజ్ చేసినట్లు డోనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుండో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో చాలావరకు విఫలమైన డోనాల్డ్ ట్రంప్ ఎక్కువగా తన ఫోకస్ మొత్తం చైనా పైనే పెట్టారు. చైనా దేశం లో వైరస్ బయటపడిన సందర్భంలో ప్రపంచాన్ని అలెర్ట్  చేయకుండా చైనా కావాలని మైండ్ గేమ్ ఆడిందని డోనాల్డ్ ట్రంప్ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసినదే. దింతో అమెరికా దేశంలో ఉన్న టెలికాం సంస్థలపై కూడా ఆంక్షలు విధించడానికి ట్రంప్ అప్పట్లో నిర్ణయం తీసుకోవడానికి అడుగులు వేసిన సందర్భం కూడా అందరికీ తెలిసినదే.

 

ఇలాంటి పరిస్థితుల్లో వెయిట్ చేసి చేసి అమెరికా ని చావు దెబ్బ కొట్టే విధంగా చైనా సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. 99 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే విధంగా  'వన్స్ అపాన్ ఎ వైరస్ ..' అనే టీజింగ్ వీడియోను చైనా విడుదల చేసింది. డోనాల్డ్ ట్రంప్  వైరస్ వచ్చిన సందర్భంలో వ్యవహరించిన తీరును ఎండగడుతూ చైనా దేశం ఈ వీడియోలో సెటైర్లు వేసింది.

 

అంతేకాకుండా ‘మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది’ అని చైనా పై అమెరికా ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ వీడియోలో అమెరికాను అపహాస్యం చేశారు. ఇదే సమయంలో "ప్రపంచ ఆరోగ్య సంస్థ" మరియు చైనా కలిసి కుట్ర పన్నినట్లు అమెరికా చేసిన వ్యాఖ్యలకు అలా దీటుగా ప్రతి విమర్శలు ఈ వీడియోలో చైనా చేసింది. సరిగ్గా అమెరికా ఎన్నికల సమయంలో చైనా ఈ విధంగా వ్యవహరించడంతో... డోనాల్డ్ ట్రంప్ చైనాపై మరిన్ని వ్యాపార ఆంక్షలు విధించాలని డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: