ఏపీ సీఎం జగన్ ఖ్యాతి రోజు రోజుకి పెరుగుతుంది. జగన్ చేస్తున్న పనుల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటిలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి జగన్ సర్కార్ కి సరైన సపోర్టు లేదని వార్తలు వచ్చినా ఇటీవల మెల్లమెల్లగా ఒక్కొక్కరు జగన్ సర్కార్ కి దగ్గరవుతున్నారు. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి, వివి వినాయక్, నిర్మాత సురేష్ బాబు తాజాగా హరీష్ శంకర్. ఇలాంటి విపత్కర సమయంలో జగన్ చేస్తున్న మంచి పనులు పరిపాలన పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జగన్ పరిపాలనాదక్షుడు అని మంచి మనసున్న నాయకుడు అని కొనియాడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ మొత్తం జగన్ నామస్మరణం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగన్ ఇచ్చిన సర్ ప్రైజ్ జన్మలో మరువలేనని జగన్ గురించి చిరంజీవి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ నివాసం వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా చిరంజీవి దంపతులు కలవటం మనకందరికీ తెలిసినదే. ఆ సమావేశానికి సంబంధించి రకరకాల వార్తలు వచ్చినా చిరంజీవి గాని, జగన్ గాని పెద్దగా స్పందించలేదు. కాగా ఇటీవల జగన్ ని ఆరోజు ఎందుకు కలవాల్సి వచ్చింది అన్న దానిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం తో కొన్ని దశాబ్దాలుగా స్నేహ పూర్వక సంబంధం ఉందని, నేను కూడా సాక్షి దిన పత్రిక ప్రారంభోత్సవంలో పాల్గొన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఇక మీడియా సంస్థకు సంబంధించి కొన్ని కార్యక్రమాలకు తాను హాజరయ్యానని ఆ టైంలో వైయస్ జగన్ భార్య భారతి రిసీవ్ చేసుకున్న విధానం ఎప్పటికీ మర్చిపోలేని చిరంజీవి చెప్పుకొచ్చారు.

 

తనను ఎంతగానో గౌరవించడం జరిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అదే సమయంలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తనకి కూడా ఆహ్వానపత్రిక పంపడం జరిగిందని తెలిపారు. కానీ ఆ టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేక పోయినట్లు తెలిపారు. అయితే సైరా సినిమా తెలుగు రాజకీయాలకు చూపించాలని కోరడానికి జగన్ ని అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే తనని ఊహించని విధంగా ఇంటికి ఆహ్వానించారని, మర్చిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇదే క్రమంలో మరికొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో చెందిన నటీనటులు కరోనా వైరస్ సమయంలో జగన్ అనుసరిస్తున్న విధానాలను పొగుడుతున్నారు. మొత్తంమీద చూసుకుంటే జగన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఊహించని మద్దతు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: