జగన్ అంటేనే కాలం కంటే ముందు. ఆయన పదండి ముందుకు అంటారు. అది కరోనా కాలమైనా కూడా జగన్ దూకుడు ఆగదు. ఎన్ని అడ్లు అచ్చినా మరెన్ని బ్రేకులు వేసినా కూడా జగన్ స్పీడ్ తగ్గదు, జగన్ మనసులో ఒక ఆలోచన పుట్టాలి కానీ అది ఆచరణలోకి రావాల్సిందేనని అంటారు. ఇక జగన్ ఇపుడు భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకున్నారు.

 

మధ్యలో కరోనా వచ్చి పుణ్యకాలాన్ని రెండు నెలల పాటు తినేసింది. అయినా ఇపుడు నష్టమేమీ లేదు అంటున్నారు జగన్ ఆ రెండు నెలలు కూడా యాక్షన్ ప్లాన్ లో ముందుకు తోసేసి మరీ కధ కానిచ్చేద్దామని అంటున్నారు. జగన్ ముందు ఇపుడు అర్జంట్ గా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.

 

ఇపుడు కేంద్రం సడలింపులు ఇవ్వడం వల్ల జగన్ తన ప్లాన్ ని ఆచరణలోకి తెస్తున్నారు. జూన్ నెలలో లోకల్ బాడీ ఎన్నికలు జరిపించేందుకు రంగం సిధ్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికలు సాఫీగా జరిపించందుకు కూడా జగన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది. వీలైతే పోలింగ్ బూతులను మరిన్ని పెంచి అయినా ఎన్నికలను జరిపించాలని, సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని కూడా జగన్ ఆదేశిస్తున్నారు.

 

ఇక గంటకు యాభై మంది వంతున టైం స్లాట్ విధించి వారినే పోలింగ్ బూతులకు రప్పించేలా చూడడం. వారి మధ్య సామాజిక దూరం పాటించేలా చూడడం, పోలింగు బూతుల్లో కూడా శానిటైజర్లు, ఇతర పరిశుభ్రత వస్తువులు అన్నీ ఉంచడం చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ చూపు ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల మీద ఉంది. జూన్ లో అది జరిపించేస్తే ఇక జూలైలో పట్టాల పంపిణీ. అదే నెలలో విశాఖకు రాజధాని షిఫ్ట్ వంటివి ఉంటాయని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: