ఉత్తర కొరియా అధ్యక్షుడు ప్రపంచంలో నియంత అని పిలిపించుకున్న నాయకుడు కిమ్ జాంగ్. కాగా గత కొద్ది నెలల నుండి ఈ నా ఆరోగ్యం పై రకరకాల కథనాలు వార్తలు రావటం జరిగాయి. గుండెపోటు వల్ల సర్జరీ చేస్తున్న సమయంలో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు...స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల ఈ విధంగా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అసలు ఆయన మరణ పడకపై ఉన్నారని బతికే ఛాన్స్ లు లేవని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అదేసమయంలో ఆయన స్థానం లోకి ఆయన చెల్లెలు అధ్యక్ష పదవి చేపట్ట బోతున్నట్లు ఇలా రకరకాలుగా వార్తలు రావడం జరిగింది.

 

అయితే వచ్చిన వార్తలపై కిమ్ జాంగ్ క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టుగా మీడియా ముందుకు వచ్చి నేను బతికే  ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కార్యక్రమానికి వెళ్లడంతో ఈ న్యూస్ వైరల్ అయినట్లు ఉత్తరకొరియా మీడియా స్పష్టం చేసింది. వాస్తవానికి అయితే కిమ్ జీవితం అప్పుడప్పుడు ప్రపంచ దృష్టి మరల్చడానికి ఈ విధంగా వ్యవహరిస్తారని ఆయన శత్రువులు అంటుంటారు. ప్రపంచం తన గురించి ఏమనుకుంటుందో అని ఆతృతతో సగం నిజం - సగం అబద్ధం జీవితాన్ని జీవిస్తూ సొంత దేశ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తరని ఆరోపిస్తారు.

 

ఈ విధంగానే వ్యవహరించి దేశంలో తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారేమో అని...వాళ్ళు బయట పడతారేమో అని కిమ్ ఈ విధంగా ఎత్తుగడ అప్పుడప్పుడు వేస్తారని చాలామంది అంటారు. కాగా ప్రస్తుతం కిమ్ బతికే ఉన్నట్లు స్పష్టమైన వార్త రావడంతో ఆయన శత్రు దేశాలు యధావిధిగా చాలా అలర్ట్ గా ఉన్నాయి. మరోపక్క అగ్రరాజ్యం అమెరికా మరియు కొన్ని దేశాలు కిమ్ బతికి ఉండడాన్ని బట్టి చాలా ఆనందం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: