ఈ ఏడాది ఖగోళ విశేషాలు పరంపర క్రమక్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. చాలా తక్కువ సమయాలల్లో  కనిపించే సూపర్ మూన్ ఈ  ఏడాది ఇప్పటికే మూడు సార్లు దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. అబ్బా మూడుసార్లు దర్శనం ఇచ్చినప్పటికీ చూడలేక పోయామే  అని బాధ పడుతున్నారా.. ఏం పర్లేదు మరో రెండు రోజుల్లో నాలుగోసారి కూడా సూపర్ మాన్ అందరినీ కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మే 7వ తేదీన బుద్ధ పూర్ణిమ రోజున.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో.... చంద్రుడు భూమికి అతి సమీపంలోకి రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

 

 నాసా నుంచి వెలువడిన వివరాల ప్రకారం మే 5 నుంచి 8 వ తేదీ ఉదయం వరకూ... చంద్రుడు పూర్తిగా దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది... ఇక ఇలా పూర్తిగా దర్శనమిచ్చే చంద్రుని సూపర్ మూన్,  ఫ్లవర్ మూన్  అంటూ రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. అయితే ఇప్పటికే మూడు సార్లు దర్శనమిచ్చిన సూపర్ మాన్ మరో రెండు రోజుల్లో దర్శనమివ్వనుండగా ఈ ఏడాది ఇదే చివరి సూపర్ మూన్  అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పుడు గాని  మిస్ అయ్యారంటే మళ్లీ సూపర్ ముందు చూడాలి అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న  వరకు ఆగాల్సిందే. 2021 ఏప్రిల్ 27న సూపర్ మూన్ దర్శన భాగ్యం కలుగుతుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఏడాదిలో మరోసారి సూపర్ ముందు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. 

 

 

 భూమికి అత్యంత సమీపంగా చంద్రుడు రావడం కారణంగా ఇలాంటి అద్భుతాలు చోటు చేసుకుంటూ కనువిందు  కలిగిస్తూ ఉంటాయి. సాధారణంగా అయితే భూమికి చందమామ కి మధ్య దూరం 384 వేల కిలోమీటర్లు. కొన్నిసార్లు పరిభ్రమణం సమయంలో ఈ దూరం తగ్గుతూ వస్తూ ఉంటుంది...ఈ  ఏడాది ఏప్రిల్లో ఏర్పడిన సూపర్ మాన్ సందర్భంలో భూమికి చంద్రుడికి మధ్య దూరం 356 వేల కిలోమీటర్లు గా ఉండగా... చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాడు. ఇప్పటికే మూడు సార్లు ఈ సూపర్ మూన్ చూడలేక పోయాము అని బాధ పడుతున్నవారు మరో రెండు రోజుల్లో వచ్చే సూపర్ మూన్  చూసి తరించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి మాత్రం సూపర్ మూన్  చూడటం అస్సలు మిస్ కావొద్దు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: