ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో  మందుబాబుల పరిస్థితి దారుణం గా మారిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేస్తారా అని ఎంతో నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు. రోజు మద్యం తాగితే కానీ పూటగడవని మందుబాబులకు దాదాపు 40 రోజులకు పైగా లాక్‌డౌన్‌ కొనసాగడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే లాక్ డౌన్  సడలింపులు చేస్తూ అన్ని రాష్ట్రాలు మద్యం షాపులు ఓపెన్ చేస్తుండడంతో మందుబాబులు అందరికీ కొత్త ఊపిరి వచ్చినట్లయింది. దీంతో మందుబాబులు అందరూ మద్యం షాపుల వద్ద బారులు తీరుతున్నారు.ఏ  మద్యం షాపు దగ్గర చూసిన పెద్దగా క్యూ  కనిపిస్తోంది. ఎంత సేపు వేచి చూసి అయినా సరే మద్యం తీసుకువెళ్లడానికి ఇష్టపడుతున్నారు  మందుబాబులు. 

 

 

 అయితే తాజాగా మద్యం ఓ కానిస్టేబుల్ ప్రాణాలు తీసింది. చాలా రోజుల తర్వాత మద్యం సేవించిన ఒక కానిస్టేబుల్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. హెడ్ కానిస్టేబుల్ గా  పనిచేస్తున్న వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అంబర్ పేట్  ప్రేమ్ నగర్ లో నివాసముంటున్న బాలరాజ్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు... అయితే తాజాగా బాలరాజు సోమవారం మధ్యాహ్నం సమయంలో చాలా రోజుల తర్వాత మద్యం సేవించాడు... ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెల్లి తలుపులు వేసుకున్నాడు బాలరాజు. 

 

 

 దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు తలుపు తట్టి చూడగా ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూశారు. ఈ క్రమంలోనే బాలరాజు చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో అవాక్కయిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏకంగా తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి అతనిని కాపాడేందుకే ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే బాలరాజు మృతి చెందాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: