ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజమైన వాల్మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను పునరుద్ధరించుకుంటు వినియోగదారుల ఆకర్షిస్తూ ఉంటుంది ఫ్లిప్కార్ట్.ఇక  తాజాగా ఫ్లిప్కార్ట్ గురించి ఓ సంచలన ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ లో 2018 నుంచి గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విధుల్లో ఉన్న తాజాగా ఎమిలీ మేక్ నీల్ తాజాగా ఆయన ఉద్యోగానికి  రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.ఈ  విషయాన్ని స్వయంగా ఫ్లిప్కార్ట్ సంస్థ నిర్ధారించింది. ఇక ఫ్లిప్కార్ట్ కొత్త సీఎఫ్ఓగా శ్రీరామ్ వెంకటరమణ ను  నియమించినట్లు ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

 

 

 కాగా కొత్తగా సీఎఫ్ఓగా నియమింపబడిన  శ్రీరామ్ వెంకటరమణ వాల్మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సిఎఫ్ఓ క్రిస్ నికోలస్ కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తారంటూ పేర్కొంది. అయితే ఫ్లిప్కార్ట్ మింత్రా లకు సంబంధించిన పలు పన్ను చెల్లింపు వ్యవహారాలు సహా రిస్క్ మేనేజ్మెంట్ మరియు ట్రెజరీ తదితర కార్యకలాపాలను శ్రీరామ్ నిర్వహిస్తారు అంటూ తాజాగా ఫ్లిప్కార్ట్ సంస్థ వెల్లడించింది.. అయితే వాల్మార్ట్ వెలుపల మెరుగైన అవకాశాల కోసం... తాను తిరిగి యూఎస్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన ఎమిలీ మేక్ నీల్.. అందువల్లనే  రాజీనామా చేస్తున్నట్లు  2018 నుంచి గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్న ఎమిలీ  తన రాజీనామా లేఖలో  వెల్లడించినట్లు తాజాగా ఫ్లిప్కార్ట్ తెలిపింది. 

 

 

 ఫ్లిప్కార్ట్ లో  ఎమిలీ మెక్ నీల్  సేవలను ఎప్పుడు మరవదని సంస్థ అభివృద్ధిలో ఎంతగానో కీలక పాత్ర పోషించారు అంటూ కితాబిచ్చింది  ఫ్లిప్కార్ట్. ఇక తాజాగా దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా ప్రస్తుతం కొత్త సిఎఫ్ఓ గా నియమింప పడిన శ్రీరామ్ వెంకటరమణ ఫ్లిప్కార్ట్ సంస్థను మరింతగా అభివృద్ధి చేస్తారా  అన్నది ప్రస్తుతం ఆయన ముందున్న సవాలు. ఎందుకంటే 2018 నుంచి గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్న ఎమిలీ  మేక్ నీల్ సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: