ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా.. ఒక్క అడుగు కూడా వెనుకకు వేయం. అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాం.  అబ్బో ఇదేదో మహా వీరులు ఏదో పోరాటం చేస్తున్నారు.. అందుకే ఇంత పెద్ద డైలాగులు కొడుతున్నారు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే.  ఈ డైలాగ్స్ కొడుతుంది మందుబాబులు. అవును ఒకటా రెండా ఏకంగా 40 రోజులు ఎంతో ఓపికతో మందు కోసం వెయిట్ చేశారు.  నిన్నటి నుంచి మందు షాపులు తీయడంతో క్యూ లైన్లలో నిలబడి మందు సాధించుకు పోతున్నారు.  ఇక మందు బాటిళ్లు తమ చేతికి రాగానే.. ప్రపంచ యుద్దాన్ని గెల్చినట్టు.. పోయే ప్రాణం ఒక్కసారే వెనక్కి వచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యారు.  కొంత మంది డ్యాన్స్ లు చేస్తూ.. పటాసులు కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై సడలింపులు ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.

 

దాదాపు నెలన్నర తరువాత మద్యం దుకాణాలు ఓపెన్ అవుతుండడంతో మద్యంప్రియులు వైన్స్ షాపుల ముందు బారులు తీరారు.  మందు షాపు ల ముందు భారీ లైన్లలో నిలబడి ఎంతో వ్యవ ప్రయాసలకు ఓర్చి మద్యం బాటిల్లు తమ జేబులో పెట్టుకొని ఆనందంగా వెళ్లి పోతున్నారు.  ఉత్తరాఖండ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వడగండ్ల వాన కురుస్తున్నా మద్యం ప్రియులు క్యూ లైన్ లో నిల్చున్నారు. నైనిటాల్‌లోని ఓ వైన్‌ షాప్ బయట ఈ సంఘటన జరిగింది. కొందరు గొడుగులతో వస్తే మరికొందరు రెయిన్‌కోట్‌లు వేసుకుని వచ్చారు.  

 

కొందరు గొడుగులతో వస్తే మరికొందరు రెయిన్‌కోట్‌లు వేసుకుని వచ్చారు. ఇంతలోనే వడగండ్ల వాన కురవడం మొదలైంది. కస్టమర్లు వెళ్లిపోతారని వైన్ షాపు నిర్వాహకులు ఊహించారు. అయితే ఎంత ప్రతికూల వాతావరణం ఉన్నా మందుబాబులు వెనక్కు తగ్గలేదు. వానతో పాటు వడగండ్లు కురుస్తున్నా లెక్కచేయలేదు. తమ వంతు వచ్చేదాకా ఆగి మద్యం కొనుగోలు చేశారు. ఏదో సాధించామనే ఫీలింగ్‌తో అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: