ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా గురించిన ప్రస్థావనలే.. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు చిన్నా పెద్ద మాట్లాడుకునే మాట కరోనా.  ఎక్కడో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తుంది. ఎన్నో మరణాలు సంబవిస్తున్నాయి.. మరెన్నో కేసులు నమోదు అవుతున్నాయి.  మనిషికి మనిషి దూరాన్ని పెంచుతుంది.. ఆర్థిక నష్టాన్నీ తీసుకు వస్తుంది.  ఐనవారు చనిపోయినా.. చూడలనేని దౌర్భాగ్యం నెలకొంది. ఒకదశలో ఎవరైనా చనిపోతే వారిని ఖననం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది.  తాజాగా ఐనవారంతా ఉన్నా అంతిమయాత్ర చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

 

కరోనా పుణ్యమా అని అంతా భయపడుతున్న వేళ వలంటీర్లే అన్నీ తామై పాడె మోసి అంతిమ సంస్కరాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.  30వ వార్డుకు చెందిన షేక్ నన్నే బుజ్జి(75) చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో సోమవారం మరణించడంతో ఆయన కొడుకులు ఇంటికి వచ్చారు.  ఇక సాంప్రదాయం ప్రకారం అంఅంత్యక్రియలు చేసేందుకు మత పెద్దలకు చెప్పినా ముందుకురాలేదు. అయితే ఆ ఏరియా మొత్తం రెడ్ జోన్లో ఉండటం వల్ల కరోనా భయానికి ఎవరూ గడపదాటే పరిస్థితి లేకుండా పోయింది.

 

ఈ విషయం గురించి స్థానికంగా ఉన్న వార్డు వాలంటీర్లకు విషయం తెలిసింది. వెంటనే వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి స్నానం చేయించి జాగ్రత్తగా ప్యాక్ చేశారు. ఆ వృద్దుడి మృతదేహాన్ని   తమ భుజాలపై మోసుకుంటూ.. చిలకలూరిపేట రోడ్డులోని కబ్రిస్తాన్‌కు చేర్చారు. ఆపద సమయంలో అన్ని తామై వ్యవహరించిన వాలంటీర్లు పనితీరుకు పలువురు మెచ్చుకున్నారు. ఈ విషయం గురించి  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వాలంటీర్ల ధైర్యానికి.. మంచి తనానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: